Asia Cup 2025: మళ్ళీ పాకిస్తాన్ కంప్లైంట్..ఈసారి టీవీ అంపైర్ పై

 టీమ్ ఇండియాతో మ్యాచ్ అయిన ప్రతీసారి ఏదో ఒక గొడవ చేయాలని పాక్ డిసైడ్ అయినట్టుంది. సూపర్ -4 మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్...టీవీ అంపైర్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వివరాలు కింద ఆర్టికల్ లో..

New Update
pak complaint

ఆదివారం ఆసియా కప్(Asia cup 2025) లో భాగంగా.. దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం(Dubai International Stadium) వేదికగా ఇండియా, పాకిస్తాన్(India vs Pakistan 2025) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.  పాకిస్తాన్ జట్టు బాగానే ఆడినప్పటికీ..భారత్ అన్ని విధాలా ఆధిక్యం ప్రదర్శించింది.  ఈ మ్యాచ్ ముందు, తరువాత కూడా టీమ్ ఇండియా..పాక్ ఆటగాళ్ళతో కరచాలనం చేయలేదు. 

మళ్ళీ ఫిర్యాదు..

అయితే మ్యాచ్ అయిన తరువాత పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ అవుట్ పై పీసీబీ(pcb) వివాదం చేస్తోంది.  జమాన్ అవుట్ అవలేదని..కానఈ టీవీ అంపైర్ అవుట్ అయినట్టు చెప్పారని అంటోంది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.  ఫకర్ జమాన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్య  బౌలింగ్ లో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. సంజూ... జమాన్ బాల్ ను క్లియర్ గానే క్యాచ్ పట్టాడు. అయితే ఫీల్డ్ అంపైర్ దీనిని ముందుగా ఔట్ ప్రకటించలేదు.  టీవీ అంపైర్ కు రిఫర్ చేశాడు. అక్కడ క్లీన్ క్యాచ్ అని చెప్పి అవుట్ ప్రకటించారు. ఓ కోణంలో బంతి నేలను తాకి బౌన్స్ అయినట్లుగా కనిపించినా, వికెట్ కీపర్ చేతివేలు బంతి కింద ఉన్నట్లుగా అంపైర్ తేల్చి ఔట్ ఇచ్చాడు.  దీనిపై అప్పుడే ఫకర్ జమాన్ అసంతృప్తి వెలిబుచ్చాడు. అదే చిరాకులో గ్రౌండ్ కూడా వీడి వెళ్ళాడు.  ఇప్పుడుడ దీనిపైనే పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా...మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కు మొదట ఫిర్యాదు చేశారని...ఆయన తన చేతిలో లేదని చెప్పాక ఐసీసీకి కంప్లైంట్ చేశారని తెలుస్తోంది.  
 
 మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా ఫకర్ జమాన్ జౌట్ మీద అసహనం వ్యక్తం చేశాడు.  బంతి వికెట్ కీపర్ అందుకునే లోపునే బౌన్స్ అయినట్లు నాకు అనిపించిందని అన్నాడు.  అతను అప్పుడు ఔట్ అవ్వకపోయి ఉండి ఉంటే పవ్ ప్లే మొత్తం అడేవాడని అన్నాడు. అప్పుడు మేం 190 పరుగులు చేసి ఉండే వాళ్ళమేమో అని సల్మాన్ అఘా కామెంట్ చేశాడు. 

Also Read:  Sourav Ganguly: క్యాబ్  అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..మళ్ళీ ఆరేళ్ళ తర్వాత

Advertisment
తాజా కథనాలు