Shubman Gill: మరో ఐదు రోజుల్లో దులీప్‌ ట్రోఫీ.. శుభ్‌మన్‌ గిల్‌ దూరం.. కారణమిదే!

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీకి గిల్ దూరమైనట్లు సమాచారం. ఈ ఫీవర్ తగ్గకపోతే ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Shubman Gill

Shubman Gill

టీమిండియా(Team India) క్రికెటర్ శుభ్‌మన్ గిల్(shubman-gill) ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరచాడు. త్వరలోనే ఆసియ కప్ ప్రారంభం కానుంది. దీనికి వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ప్రకటించింది. అయితే మరో ఐదు రోజుల్లో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కానీ ఇందులో శుభ్‌మన్ గిల్ ఆడటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ దులీప్ ట్రోఫీకి దూరం అయినట్లు సమాచారం. నిజానికి దులీప్‌ ట్రోఫీలో నార్త్‌ జోన్ జట్టుకు సారథిగా (కెప్టెన్‌గా) శుభ్‌మన్‌ గిల్‌ను మొదట ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు గిల్‌కి బదులు ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అంకిత్ కుమార్‌‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ జాక్‌పాట్.. వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు ?

దులీప్ ట్రోఫీ(duleep-trophy) జరిగిన తర్వాత ఆసియా కప్(Asia Cup) కూడా ప్రారంభం కానుంది. గిల్‌కు ఫీవర్ తగ్గకపోతే ఇందులో కూడా ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆసియా కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో సూర్యకుమార్‌ యాదవ్ నాయకత్వంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసియా కప్ కోసం భారత జట్టు సెప్టెంబర్ ఆరంభంలోనే యూఏఈకి బయలు దేరనుంది. సెప్టెంబర్ 5న తొలి ట్రైనింగ్ సెషన్ కూడా జరగనుంది. ఇంతలోనే గిల్‌కి ఫీవర్ రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారను. ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడాల్సి ఉంది. ఈలోగా గిల్ పూర్తిగా కోలుకుంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టుతో కలిసి దుబాయ్ చేరుకుంటాడు. అయితే గిల్ త్వరలోనే కోలుకుని ఆసియా కప్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆసియా కప్ జట్టు ఇదే

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాదవ్‌, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇది కూడా చూడండి: India vs Pakistan : పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడవచ్చు.. కేంద్రం క్లారిటీ!

Advertisment
తాజా కథనాలు