జర జాగ్రత్త.. రోజురోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్స్.. |Fever | RTV
జర జాగ్రత్త.. రోజురోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్స్.. | Patients Rush To Govt Fever Hospital | Seasonal Viral Fevers are increasing in Telangana | RTV
జర జాగ్రత్త.. రోజురోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్స్.. | Patients Rush To Govt Fever Hospital | Seasonal Viral Fevers are increasing in Telangana | RTV
దోమల వల్ల మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఏడిస్ ఈజిప్టి అనే ఆడ దోమ కుట్టడం ద్వారా మనుషులకు డెంగ్యూ వైరస్ సోకుతుంది. మురికివాడల్లో, ఖాళీ ప్రదేశాల్లో నీరు లేకుండా చేయాలి.
ఈ సీజన్లో వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందాలంటే డైలీ కూరగాయల జ్యూస్‌లు తాగాలి. అలాగే గోరువెచ్చని నీరు తాగడం, శుభ్రత పాటించడం, బాడీ హైడ్రేట్‌గా ఉంచుకోవడం, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తే తొందరగా వైరల్ ఫీవర్ మటాష్ అవుతుంది.
బీహార్ వాసులను లేమ్ ఫీవర్ వణికిస్తోంది. దోమ కాటుతో వ్యాపి చెందుతున్న ఈ వైరస్ సోకితే చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డుపక్కన దొరికే ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఫీవర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే ప్రజల్లో జ్వరాల భయం మొదలవుతుంది. ఈ సీజన్ లో వాతావరంలోని మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దోమలు, నీటి కాలుష్యం, బలహీనమైన రోగనిరోధక శక్తి జ్వరాలకు ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి.
ఈ వైరల్ ఫీవర్ లక్షణాలు మామూలు జ్వరాల్లానే కనిపిస్తాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూతో పాటు చాలా రకాల జ్వరాలు వస్తున్నాయి. కాకపోతే వికారం, శరీరం నొప్పులు మలబద్ధకం ఉంటే తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పుడు నడుస్తోంది వర్షాకాలం. ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేకప్రాంతాల్లో విరుచుకుపడుతోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ లాంటిదే కానీ ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తారు. అయితే వైరల్ ఫీవర్లు వచ్చినా లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.