India vs Pakistan : పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడవచ్చు.. కేంద్రం క్లారిటీ!

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడా సంబంధాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది.

New Update
ind vs pak

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడా సంబంధాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లకు భారత్ అనుమతించదని తేల్చి చెప్పింది. అంటే దీని అర్థం, భారత్ జట్టు పాకిస్తాన్ లో ఆడదు, అలాగే పాకిస్తాన్ జట్టు భారత్ లో ఆడటానికి వీలులేదన్న మాట. 

అయితే, ఆసియా కప్, ఐసీసీ వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ, బహుళ దేశాలు పాల్గొనే టోర్నమెంట్లలో పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లకు క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో టీమ్ ఇండియా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నివేదికతో ద్వైపాక్షిక సిరీస్ ల పట్ల భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, అయితే అంతర్జాతీయ టోర్నమెంట్ల కోసం రెండు దేశాలు తటస్థ వేదికలపై ఆడుకునేందుకు మార్గం సుగమం అయిందని స్పష్టం అయింది.

కాగా ఈసారి ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరుగుతుంది. మ్యాచ్ లు సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 28 వరకు దుబాయ్, అబుదాబి నగరాల్లో జరుగుతాయి.ఇది 17వ ఎడిషన్, ఈసారి టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరుగుతాయి. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు ఇది ఒక మంచి సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది.మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్.
గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్.

భారత్ షెడ్యూల్:

సెప్టెంబర్ 10: భారత్ వర్సెస్ యూఏఈ (దుబాయ్)

సెప్టెంబర్ 14: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)

సెప్టెంబర్ 19: భారత్ వర్సెస్ ఒమన్ (అబుదాబి)

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

ప్రతి గ్రూపులో టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 4 దశలో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సూపర్ 4 దశలో టాప్ 2 జట్లు ఫైనల్ లో తలపడతాయి. ఈ టోర్నమెంట్ మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్ లో జరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు