Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ జాక్‌పాట్.. వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు ?

ఆసియా కప్‌ కోసం BCCI ఇటీవల భారత జట్టును ప్రకటించింది. ఆ టీమ్‌లో శ్రేయస్ అయ్యార్‌కు చోటు దక్కలేదు. దీనిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ODI కెప్డెన్‌ బాధ్యతలు శ్రేయస్‌కు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
shreyas iyer

shreyas iyer

సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న ఆసియా కప్‌ కోసం BCCI ఇటీవల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టీమ్‌లో శ్రేయస్ అయ్యార్‌కు చోటు దక్కలేదు. దీనిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్‌ బాగా ఆడుతున్నప్పటికీ అతడ్ని టీమ్‌లోకి తీసుకోకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ODI కెప్డెన్‌ బాధ్యతలు శ్రేయస్‌కు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టుకు గిల్, టీ 20కి సూర్యకుమార్ యాదవ్‌ సారథ్యం వహిస్తున్నారు. 

Also Read: రష్యా..భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి.. జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్

ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు, టీ 20లకు వీడ్కోలు పలికారు. త్వరలోనే వన్డే మ్యాచ్‌ల నుంచి కూడా వైదొలగనున్నారు. దీంతో అతడి స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ODI కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యార్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ తర్వాత శ్రేయస్ అయ్యార్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని BCCI వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లకు శుబ్‌మన్ గిల్ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నారు. వర్క్‌లోడ్‌ నిర్వహణలో భాగంగా కెప్టి్న్సీ బాధ్యతలు గిల్‌కు కాకుండా శ్రేయస్‌కు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆసియా కప్ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. 

ఇక రాబోయే రోజుల్లో టీమిండియా వరుస ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ ఈవెంట్లలో ఆడనుంది. మూడు ఫార్మాట్లలో ఒకే ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం సాధ్యం కాదు. అందుకే గిల్‌కు టెస్టు కెప్టెన్సీతో పాటు టీ20ల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  భవిష్యత్తులో గిల్ టీ 20 కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ వన్డే కెప్టెన్సీ మాత్రం శ్రేయస్‌ అయ్యార్‌ లాంటి ప్లేయర్లే కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరో విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యార్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టీమ్ ఇండియా జట్టుగా కెప్టెన్‌గా ఉండలేదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం అతడికి కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. ముంబై టీమ్‌గా అయ్యార్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే 2024/25 విజయ్ హజారే ట్రోఫీకి కూడా సారథ్యం వహించాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు 5 మ్యాచ్‌లు ఆడి 325 పరుగులు చేశాడు. ఇక 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు ముంబై టీమ్‌కు కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ అందించాడు.   

Also Read: ఎక్కడైనా ఫ్రెండే కానీ ఆంక్షల దగ్గర కాదు..రష్యా విమానాలకు ఇంధనం ఇవ్వని అమెరికా

ఇదిలాఉండగా ఆసియా కప్‌-2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 28 వరకు అక్కడ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిని టీ20 ఫార్మాట్‌లలోనే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో  సెప్టెంబర్‌ 10న భారత జట్టు మొదటి మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్ 14న భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 19న లీగ్ చివరి మ్యాచ్‌లో చూసుకుంటే ఒమాన్‌తో టీమిండియా తలపడనుంది. 

Advertisment
తాజా కథనాలు