/rtv/media/media_files/2025/10/25/ro-ko-2025-10-25-22-55-48.jpg)
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరీస్‌లో మూడో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చసిన ఆసీస్‌ను 263 పరుగులకే కట్టడి చేసింది. టీమ్ ఇండియా. తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ శర్మ (121; 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (74*; 81 బంతుల్లో 7 ఫోర్లు)లతో చితక్కొట్టారు. రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సీరీస్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ నెలకొల్పిన రికార్డులు..
ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. విరాట్ 5, కుమార్ సంగక్కర 5 సెంచరీలను అధిగమించి..రోహిత్ 6 సెంచరీలను చేశాడు.
ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డ నెలకొల్పాడు. వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ రికార్డ్ నెలకొల్పాడు.
వన్డేల్లో హిట్‌మ్యాన్‌కిది 33వ సెంచరీ. రోహిత్ కన్నా ముందు సచిన్ 9, విరాట్ కోహ్లీ 9ని సమం చేశాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో హిట్ మ్యాన్ కిది 50వ సెంచరీ. ఇప్పటి వరకు టెస్ట్‌లలో 12, వన్డేల్లో 33, టీ20ల్లో సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ మాత్రమే.
ఇక కోహ్లీ విషయానికి వస్తే..వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. 14,255 పరుగులతో..కుమార సంగక్కర 14,234 పరుగులను అధిగమించాడు. మొదటి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 18,426 ఉన్నాడు.
అలాగే వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక (70)సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు.
వీటితో పాటూ ఆస్ట్రేలియాపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా సచిన్ (24) రికార్డును కోహ్లీ సమం చేశాడు.
రోహిత్, కోహ్లీ ఇప్పటివరకు 12సార్లు 150కిపైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. సచిన్, గంగూలీ కూడా ఇదే 150సార్లకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు.
Follow Us