/rtv/media/media_files/2025/09/12/sachin-2025-09-12-09-39-43.jpg)
Sachin Tendulkar
2022 అక్టోబర్ లో బీసీసీఐ(bcci) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి వయోపరిమితి 70 ఏళ్ళు ముగియండతో ఆయన పదవీ కాలం రీసెంట్ గా ముగిసింది. దీంతో బీసీసీఐ ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయింది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును బీసీసీఐ ప్రకటిస్తుంది. అయితే ఈ అధ్యక్ష పదవి రేస్ లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(sachin-tendulkar) ఉన్నట్లు చాలా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా(Social Media) లో దీనిపై బోలెడు పోస్ట్ లు వెలువడ్డాయి. బీసీసీఐ కూడా దీనికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది.
సచిన్ కు అసలు ఆసక్తే లేదు..
అయితే ఈ వార్తలను తాజాగా సచిన్ నిర్వహణ సంస్థ ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖండించింది. సచిన్ పేరును అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్లు, పరిశీలిస్తున్నట్లు ప్రచారాలు తమ దృష్టికి వచ్చాయని..అవి క్లారిఫై చేయడానికే ఈ ప్రకటన అని చెప్పింది. బీసీసీఐ పదవిపై సచిన్ కు ఆసక్తి లేదని ఎస్ఆర్టీ స్పష్టం చేసింది. నిరాధారమైన ఇలాంటి వార్తలను దయచేసి ఎవరూ పట్టించుకోవద్దని చెప్పింది. ఈ ప్రకటనతో అన్ని వార్తలు చెక్ పెట్టినట్లైంది. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక సచిన్ కామెంటేటర్ గా తప్ప ఇంకే పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. వాటిపై తనకు ఆసక్తి లేదని ఆయన ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున 200 టెస్ట్‌లు, 463 వన్డేలు, ఒక్క టీ20 ఆడారు.
SRT Sports Management dismisses rumours of Sachin Tendulkar taking over as BCCI President. pic.twitter.com/uXMhke37Xz
— CricTracker (@Cricketracker) September 11, 2025
पूर्व भारतीय क्रिकेटर सचिन तेंदुलकर नहीं होंगे अगले बीसीसीआई अध्यक्ष
— News24 (@news24tvchannel) September 11, 2025
◆ एसआरटी स्पोर्ट्स मैनेजमेंट प्राइवेट लिमिटेड का आया आधिकारिक बयान
◆ कहा, सचिन तेंदुलकर को BCCI के अध्यक्ष पद के लिए नामांकित किए जाने के संबंध में कुछ रिपोर्ट और अफवाहें फैल रही हैं
◆ "हम स्पष्ट रूप से… pic.twitter.com/KATyWevCIW
ఇక సెప్టెంబర్ 28న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడితో పాటూ అంబుడ్స్ మన్, ఎథిక్స్ ఆఫీసర్ ను కూడా బీసీసీఐ నియమించనుంది. ఐసీసీలో భారత ప్రతినిధిని కూడా ఈ సమావేశంలోనే ఎంపిక చేయనున్నారు. రోజర్ బాన్నీ పదవీ కాలం ముగిసాక బీసీసీఐ తాత్కాలిక ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా ఉన్నారు.
Also Read : బంగ్లా శుభారంభం.. అదరగొట్టిన కెప్టెన్