Asia Cup 2025: బంగ్లా శుభారంభం.. అదరగొట్టిన కెప్టెన్

ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించి, టోర్నమెంట్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ తరపున లిటన్ దాస్ 59 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు.

New Update
Asia Cup 2025

Asia Cup 2025

ఆసియా కప్ 2025 టోర్నీ అత్యంత రసవత్తరంగా సాగుతుందో. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిన్న (సెప్టెంబర్ 11) బంగ్లాదేశ్ vs హాంకాంగ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్ 40 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

BAN vs HKG

అదే సమయంలో జీషన్ అలీ 34 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. యాసిమ్ ముర్తజా 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. బంగ్లా బౌలర్లలో తంజిమ్‌ హసన్, తస్కిన్‌ అహ్మద్, రిషాద్‌ హస్సేన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా తమ ప్రదర్శన చేయడంతో హాంకాంగ్ 13 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 78 పరుగులే చేసింది. 

కానీ ఆ తర్వాత హాంకాంగ్ కెప్టెన్ యాసిమ్ ముర్తజా విజృంభించడంతో స్కోర్ పరిగెత్తింది. అతడు వరుస పరుగులు రాబట్టడంతో ఇన్నింగ్స్‌కు ఊపువచ్చింది. ఇలా హాంకాంగ్ 143 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన బంగ్లాదేశ్.. 17.4 ఓవర్లలోనే విజయం సాధించింది. 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి అదరగొట్టాడు. హృదోయ్ 36 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇలా బంగ్లా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరగగా.. ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో సెదిఖుల్లా అటల్ 73* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన హాంకాంగ్ చేతులెత్తేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగులే చేసింది. 

సెకండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ భారత్ vs యూఏఈ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ తమ బ్యాట్‌తో దుమ్ము దులిపేశారు. కేవలం 4.3 ఓవర్లలో టార్గెట్‌ను కొట్టేశారు.

Advertisment
తాజా కథనాలు