/rtv/media/media_files/2025/09/11/asia-cup-2025-2025-09-11-17-39-52.jpg)
Asia Cup 2025
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, యూఏఈ మధ్య సెప్టెంబర్ 10వ తేదీన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఓ నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వంటి వారు సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 13వ ఓవర్‌ను భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే బౌలింగ్ చేస్తున్నాడు. అప్పుడు క్రీజులో జునైద్ సిద్ధిఖీ అనే బ్యాటర్ ఉన్నాడు. దూబే బౌలింగ్ చేసేందుకు పరిగెడుతున్నప్పుడు, అతని నడుముకు ఉన్న టవల్ కింద పడిపోయింది. ఇది చూసిన జునైద్ సిద్ధిఖీ అంపైర్‌కు చూపించడానికి క్రీజు నుంచి ముందుకు వచ్చాడు.
ఇది కూడా చూడండి: IND Vs Pak Asia Cup 2025: భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో పిటిషన్!
#DPWorldAsiaCup2025 | #INDvsUAE
— Kshitij (@Kshitij45__) September 10, 2025
Captain Suryakumar Yadav's heart winning gesture.
- Calls the batsman back to the crease and withdraws the appeal of the wicket.pic.twitter.com/Yj3Decu5mR
అప్పీల్ వెనక్కి తీసుకోవడంతో..
అదే సమయంలో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ తెలివిగా బంతిని వికెట్ల వైపు విసిరి జునైద్‌ను రనౌట్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా ఔట్ అని ప్రకటించాడు. అయితే రనౌట్ అయిన జునైద్ మైదానం వీడకుండా అక్కడే నిలబడి చూస్తుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంపైర్‌తో మాట్లాడాడు. బౌలర్ టవల్ జారిపోవడం వల్లే బ్యాటర్ దృష్టి మళ్లిందని సూర్యకుమార్ గ్రహించాడు. వెంటనే అతను క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తమ రనౌట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అంపైర్ జునైద్‌ను నాటౌట్‌గా ప్రకటించి మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అనుమతించాడు. కానీ జునైద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్‌లో శివమ్ దూబే వేసిన మరో బంతికి అతను నిజంగానే ఔటయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దీనిపై తీవ్రంగా స్పందించాడు.
ఇది కూడా చూడండి: BIG Breaking: ఆసియాకప్ లో భారత్ శుభారంభం..మొదటి మ్యాచ్ లో చితక్కొట్టుడు
ఇలాంటి నిర్ణయం కేవలం యూఏఈతో మాత్రమే సాధ్యమని అన్నారు. సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఇలానే చేస్తారా అని ఆకాష్ చోప్రా సూర్య కుమార్ యాదవ్‌ను ప్రశ్నించాడు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఇలానే క్రీజ్ వెలుపల తిరుగుతూ ఉంటే, మ్యాచ్ బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు సూర్యకుమార్ ఇలా చేయరని ఆయన అన్నారు. " అని చోప్రా అన్నారు. ఆటలో క్రీడా స్ఫూర్తి ముఖ్యం అయినప్పటికీ, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది సరైన రనౌట్ అయినప్పుడు ఔట్ ఇవ్వడమే సరైనదని, ఇలాంటి నిర్ణయాలు ఆటలో అనవసరమైన గందరగోళానికి దారితీస్తాయని ఆకాష్ చోప్రా అన్నారు. సూర్యకుమార్ నిర్ణయంపై అభిమానుల నుంచి కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని క్రీడా స్ఫూర్తిని మెచ్చుకుంటే, మరికొందరు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.