/rtv/media/media_files/2025/01/04/mxJW4gOshZoTBrUd7yxf.jpg)
Imran Khan
పాకిస్తాన్ జట్టు(pakistan-team) పై ప్రస్తుతం స్వంత దేశంలోనే విమర్శలతో దాడి చేస్తున్నారు. రెండు సార్లు భారత్ చేతిలో ఓడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అయితే వరుస విమర్శలతో దాడి చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైతం జట్టుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీలను ఓపెనర్లుగా పంపాలని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎగతాళి చేశారు. దాంతో పాటూ అంపైర్లుగా న్యాయవ్యవస్థ పెద్దలను పెట్టాలని అన్నారు. మాజీ పాక్ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా ఆన్ - ఫీల్డ్ అంపైర్లుగా, ఇక ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ థర్డ్ అంపైర్ గా ఉండాలని వెటకారం చేశారు.
Also Read : Asia Cup 2025: మళ్ళీ పాకిస్తాన్ కంప్లైంట్..ఈసారి టీవీ అంపైర్ పై
ఏకిపారేసిన ఇమ్రాన్ ఖాన్..
ఆసియా కప్(Asia cup 2025) లో పాకిస్తాన్ టీమ్ అల్లర్ల పాలవుతోంది. రెండు సార్లు టీమ్ ఇండియా(team-india) తో ఓడిపోవడం...తరువాత అనవర కంప్లైంట్స్ తో రాద్ధాంతాలు చేసి...తమ పరువును తామే తీసుకుంటున్నారు. క్రికెటర్లకు తోడు ఈ టీమ్ బోర్డు కూడా అలాగే ఫూలిఫ్ గా ఉంది. అందుకే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అందరూ ఇప్పుడు విరుచకుపడుతున్నారు. పాక్ ను మేము ప్రత్యర్థిగా కూడా అనుకోవడం లేదంటూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ రేంజ్ లో పరువు తీసి పడేయడంతో... అందరికీ మరింత తల తీసేసినట్టుయింది. అందుకే ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్(imran-khan) తమ దేశ క్రికెట్ర్లను క్ష రేంజ్ లో ఆడుకున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇండియాతో మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ పేసర్లు షాహీన్ అఫ్రీది, హారిస్ రవుఫ్ మైదానంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. కానీ ప్రదర్శనలో మాత్రం వెనుకబడ్డారని ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీబీ చీఫ్ నక్వీని అయితే ఏకిపారేశారు. అసమర్థత, బంధుప్రీతితో పాక్ క్రికెట్ ను అతను సర్వనాశనం చేశాడని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను ఆయన సోదరి అలీమా ఖాన్ మీడియాకు చెప్పారు.
i can literally hear this statement in Imran Khan’s voice 😭😭😭
— Iman (@imanwithik) September 22, 2025
no one cooked them like Immy Kpic.twitter.com/LR2tZCWI55
Also Read : Sourav Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..మళ్ళీ ఆరేళ్ళ తర్వాత