Shakib Al Hasan : చరిత్ర సృష్టించిన షకీబ్..  తొలి క్రికెటర్‌గా రికార్డు!

బంగ్లాదేశ్  ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్‌గా, తన దేశం నుండి తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

New Update
shakib

బంగ్లాదేశ్  ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్‌గా, తన దేశం నుండి తొలి క్రికెటర్‌గా నిలిచాడు. 38 ఏళ్ల షకీబ్  కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ తరపున ఆడుతూ, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుపై ఈ రికార్డ్ సాధించారు. ఈ మ్యాచ్‌లో షకీబ్ 3 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఆయన 500వ వికెట్‌గా మహమ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేశారు. షకీబ్ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు మరియు 7000కు పైగా పరుగులు సాధించిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా షకీబ్ చరిత్ర సృష్టించాడు. ఇక  లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్లలో 500 వికెట్లు సాధించిన మొదటి బౌలర్ కూడా షకీబే కావడం విశేషం.  ఇమాద్ వసీం 376 వికెట్లు సాధించాడు.

Also read :  Crime : అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్‌

100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన

500 వికెట్ల క్లబ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో, షకీబ్ 7,574 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, డ్వేన్ బ్రావో 6,970 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. సునీల్ నరైన్ 4,649 పరుగులతో, రషీద్ ఖాన్ 2,662 పరుగులతో, ఇమ్రాన్ తాహిర్ 377 పరుగులతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌పై షకీబ్ ప్రభావం కూడా అంతే ఆకట్టుకుంటుంది.టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2 వేల 500 కంటే ఎక్కువ పరుగులు, 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా షకీబ్ ఇప్పటికీ ఉన్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకునే ముందు, అతను బంగ్లాదేశ్ తరపున 129 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2వేల551 పరుగులు, 149 వికెట్లు సాధించాడు. ఇక  37 సంవత్సరాల 181 రోజుల వయసులో భారత్‌తో టెస్టు మ్యాచ్ ఆడి, బంగ్లాదేశ్ తరపున టెస్టు ఆడిన అతి పెద్ద వయస్కుడిగా కూడా షకీబ్ రికార్డు సృష్టించారు.

Also Read :  Smart Ration Cards : మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు