PBKS : ప్రీతి జింటాకు బ్యాడ్ న్యూస్... రూ. 2కోట్ల బౌలర్ ఔట్!

ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది.  ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు.

New Update
Lockie Ferguson

Lockie Ferguson

ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది.  ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ కేవలం రెండు బంతులు మాత్రమే వేసి మైదానం నుంచి వైదొలిగాడు. అతను ఎడమ కాలును తుంటి క్రింద గాయం కావడంతో బాధపడుతున్నాడని  జేమ్స్ హోప్స్ వెల్లడించాడు.

Also Read :  PBKS vs KKR :  టాస్‌ గెలిచిన పంజాబ్‌..కోల్‌కతా జట్టులో ఒక మార్పు

Also Read :  మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!

తొడ కండరాల గాయం కారణంగా

బ్యాటింగ్ లో అదరగొడుతున్న పంజాబ్ జట్టు.. . బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉంది. ఇలాంటి టైమ్ లో పంజాబ్ కింగ్స్  ఫెర్గూసన్ ను కోల్పోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.  తొడ కండరాల గాయం కారణంగా ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి  న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్  దూరమయ్యాడు. 2024 నవంబర్ తర్వాత ఫెర్గూసన్ గాయపడటం ఇది మూడోసారి.

కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో, ఫెర్గూసన్ 9.17 ఎకానమీ రేటుతో ఐదు వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది జరిగిన IPL 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ లాకీ ఫెర్గూసన్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2024లో, ఫెర్గూసన్ ఆర్సీబీ తరపున ఆడాడు. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.  ఏప్రిల్ 15న పంజాబ్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.  

Also Read :  Lsg Vs Csk: పంత్ రఫ్పాడించేశాడు భయ్యా.. CSK ముందు భారీ టార్గెట్

Also Read :  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..

 

Preity Zinta | latest-telugu-news | telugu-news | telugu-sports-news | telugu-cricket-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు