/rtv/media/media_files/2025/04/15/YTB0kNDfLv8ND0cEDg5F.jpg)
pbks-vs-kkr
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ 5 మ్యాచ్‌ల్లో 3, కేకేఆర్ 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. మొయిన్ అలీ స్థానంలో అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.
పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరగగా.. కేకేఆర్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2021 నుంచి ఇరుజట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు జరగ్గా.. మూడేసి మ్యాచ్‌లు గెలిచాయి.
🚨Playing 11s for KKR and PBKS 🚨
— Cricketism (@MidnightMusinng) April 15, 2025
- Josh Inglis and Xavier Bartlett come in for Marcus Stoinis and Lockie Ferguson
- Anrich Nortje comes in for Moeen Ali#PBKSvsKKR #PBKSvKKR pic.twitter.com/VD0zeDR70s
జట్లు ఇవే
పంజాబ్ కింగ్స్ : ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, జోష్ ఇంగ్లి్స్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
కోల్‌కతా : క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చకరవర్తి