Lsg Vs Csk: పంత్ రఫ్పాడించేశాడు భయ్యా.. CSK ముందు భారీ టార్గెట్

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. CSK 167 పరుగులు ఛేదించాలి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.

New Update
lsg vs csk

lsg vs csk

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. దీంతో చెన్నై జట్టు ముందు 167 పరుగుల టార్గెట్ ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు

మొదట టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు బ్యాటింగ్‌కు దిగింది. క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

ఎవరెవరు ఎన్ని కొట్టారంటే?

ఆదిలోనే లఖ్‌నవూకు షాక్ తగిలింది. మార్‌క్రమ్ ఔట్ అయ్యాడు. కేవలం6 పరుగులు మాత్రమే చేశాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 0.6 ఓవర్‌కు భారీ షాట్ ఆడాడు. అది కాస్త ఎడ్జ్ తీసుకోవడంతో రాహుల్ త్రిపాఠి సూపర్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతోతొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

ఆ తర్వాతమిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  

lsg vs csk | IPL 2025 | dhoni

Advertisment
తాజా కథనాలు