/rtv/media/media_files/2025/04/15/KpRcgbQhXFMZk28bBeZV.jpg)
Sunil Gavaskar fulfils his promise
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నాడు. సునీల్ గవాస్కర్ తన 'CHAMPS ఫౌండేషన్' ద్వారా వినోద్ కాంబ్లీకి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెలా రూ.30 వేల చొప్పున అందజేయనున్నట్లుగా తెలిపారు. CHAMPS ఫౌండేషన్ నిరుపేద మాజీ అంతర్జాతీయ క్రీడాకారులకు సహాయం చేస్తుంది. 1999లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్, కష్ట సమయాల్లో కాంబ్లీకి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం శుభపరిణామం. 2025 ఏప్రిల్ 1 నుండి CHAMPS ఫౌండేషన్ ద్వారా వినోద్ కాంబ్లీ బతికి ఉన్నంత వరకు నెలకు రూ.30000 అందిస్తానని సునీల్ గవాస్కర్ హామీ ఇచ్చారు.
Also read : ఎక్కువ చేయొద్దు.. ఎంపీ చామలకు సీఎం రేవంత్ క్లాస్.. ఆ ఎమ్మెల్యేలకు కూడా..!
A great move by Sunil Gavaskar
— UDAYRAJ PAL(सनातनी हिंदू 🕉️🕉️🕉️) FB 💯 (@UD2004k) April 15, 2025
The Sunil Gavaskar Foundation will give Vinod Kambli Rs 30,000 per month for the rest of his life from April 1 and an additional Rs 30,000 annually for medical expenses.#SunilGavaskar #VinodKambli pic.twitter.com/1LhJwMhA72
Also Read : ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?
బీసీసీఐ నుండి నెలకు రూ.30000 పెన్షన్
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో వినోద్ కాంబ్లిని సునీల్ గవాస్కర్ కలిశారు. నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంబ్లి గవాస్కర్ పాదాలను తాకారు. ఆ సమయంలోనే ఆయన పరిస్థితి తెలుసుకున్న గవాస్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నుండి నెలకు రూ.30000 పెన్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి అతని నెలవారీ ఆదాయం రెట్టింపు అవుతుంది, ఇది మాజీ క్రికెటర్ కుటుంబానికి గొప్ప సహాయంగా ఉంటుందని చెప్పాలి. గవాస్కర్ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also read : TG crime : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
Also Read : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా..టోల్ సిబ్బందిపై దాడి
CHAMPS Foundation | Sunil Gavaskar's foundation | sunil-gavaskar | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu