Kuldeep Yadav Engagement: ఎంగేజ్మెంట్ చేసుకున్న కుల్దీప్.. ఆమె మరెవరో కాదు

భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ లక్నోలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కాగా వీరి వివాహ తేదీపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు.

New Update
Kuldeep Yadav Engagement

Kuldeep Yadav Engagement

భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ (జూన్ 4) లక్నోలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. 

Also Read:రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి

ఈ వేడుకకు రింకు సింగ్ కూడా హాజరయ్యాడు. దీంతో కుల్దీప్‌కు పలువురు క్రికెట్ స్టార్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే వీరి వివాహ తేదీపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ బౌలర్ IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం అతను వచ్చే వారం ఇంగ్లాండ్‌కు వెళ్తాడు. 

Also Read:టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?

Also Read:ఆశావర్కర్‌పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష

IPL 2025లో కుల్దీప్ యాదవ్ ప్రదర్శన

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కుల్దీప్ యాదవ్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అతను 7.07 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేశాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు