/rtv/media/media_files/2025/12/09/t20-series-2025-12-09-14-56-42.jpg)
భారత్(india) కు వచ్చిన దక్షిణాఫ్రికా(south-africa) టీమ్ వరుసగా అన్ని ఫార్మాట్లలోనూ సీరీస్ లను ఆడుతోంది. దీంతో నెల రోజులుగా సఫారీలకు, టీమ్ ఇండియాకు మధ్య మ్యాచ్ లు జరుగుతూనే ఉన్నాయి. మొదట టెస్ట్ సీరీస్ లో ప్రొటీస్ చేతిలో భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. అయితే అందుకు ప్రతీకారం వన్డే సీరీస్ లో తీర్చుకుంది టీమ్ ఇండియా. వన్డే సీరీస్ లో 2-1 తేడాతో ఆ జట్టును ఓడించి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఇప్పుడు టీ 20 సీరీస్(t20-series) వంతు. ఇది ఈ రోజు నుంచే మొదలవనుంది.
Also Read : స్మృతి మంధాన పెళ్లి రద్దు..
పోటాపోటీగా టీ20 సీరీస్..
ఒక సీరీస్ గెలిచి, ఒకటి ఓడిన రెండు జట్లూ ఇప్పడు టీ20లను ఆడడానికి సిద్ధమయ్యాయి. ఈ మూడో సీరీస్ గెలిచి ఎలా అయినా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నాయి. వన్డే సిరీస్ గెలిచిన ఊపులో టీ20ల్లోనూ నెగ్గి.. టెస్టుల్లో ఎదురైన వైట్‌వాష్ పరాభవానికి గట్టి బదులివ్వాలన్న కృత నిశ్చయంతో భారత జట్టుంది.ప్రస్తుతం టీ20ల్లో ఎదురు లేకుండా వరుసగా మ్యాచ్ లను గెలుస్తూ ఉంది టీమ్ ఇండియా. మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్ కూడా మొదలవనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ తో ఈ సీరీస్ చాలా ముఖ్యమైనది కూడా అయింది. ఈ సీరీస్ కు మళ్ళీ భారత జట్టు మారనుంది. సీనియర్లు స్థానంలో సుర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలు పునరాగమనం చేయనున్నారు. ఇది భారత జట్టుకు శుభవార్త. అటువైపు దక్షిణాఫ్రికా కూడా పటిష్టంగానే ఉంది. వన్డేల్లో మ్యాచ్ లను అయితే ఓడిపోయింది కానీ...ఆజట్టు ఎక్కడా తగ్గలేదు. భారత్ కు గట్టి పోటీనే ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీ20ల్లో కూడా అంత తేలిగ్గా లొంగకపోవచ్చును. దీంతో సీరీస్ హోరాహోరీగా జరగడం ఖాయం అంటున్నారు.
Also Read : వన్డేల్లో అత్యధిక సిక్స్‌లతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
ఈరోజు నుంచే..
ఈరోజు మొదటి టీ20 కటక్ లో జరగనుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. కటక్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే విధంగా ఉంటుంది. ఆరంభంలో పేసర్లకు, తర్వాత స్పిన్నర్లకు సహకారం అందుతుంది. ఇక్కడ పరుగులు బాగానే వస్తాయి. అయితే ప్రస్తుతం మంచు ప్రభావం వల్ల ఆట సాగేకొద్దీ బౌలర్లకు కష్టమవుతుంది. అయితే ఇక్కడ టీమ్ ఇండియాకు అంత మంచి రికార్డ్ ఏమీ లేదు. అంతకు ముందు ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ భారత జట్టు ఓడిపోయింది. అది కూడా దక్షిణాఫ్రికా చేతిలోనే. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
అందరూ వచ్చేశారు..
వన్డే సీరీస్ లో సీనియర్ల హవా అయిపోయింది అంతా. కానీ ఇప్పుడు యువ ఆటగాళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ ఆడుతున్నాడు. మొదటి బంతి నుంచి చితక్కొట్టే ఇతను టీ20 జట్టులో భారత అభిమానుల ఫేవరెట్‌గా మారిపోయాడు. ఆసియా కప్‌లో, ఆపై ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటిన అభిషేక్..ఇప్పుడు సఫారీల మీద తన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకున్న కెప్టెన్ శుభ్ మన్ గిల్ పునరాగమనం చేస్తున్నాడు. అలాగే ఆసియా కప్‌లో గాయపడి రెండు నెలలకు పైగా ఆటకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. వీరికి తోడు కెప్టెన్ సూర్యకుమార్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ శివమ్ దూబెలతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇక బౌలర్లలో బుమ్రా బరిలోరి దిగుతున్నాడు. ఇతను ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ తీసినా చాలు వరల్డ్ రికార్డ్ ను సాధిస్తాడు. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన క్రికెట్ గా నిలుస్తాడు. ఇతనికి తోడు పాండ్యా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ముగ్గురినీ తుది జట్టులో చూడొచ్చు.మరో పేసర్ ఎవరుంటారనేది చూడాలి.
Follow Us