/rtv/media/media_files/2025/10/16/rohit-virat-video-2025-10-16-07-14-06.jpg)
Rohit Virat video
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా, భారత్(ind-vs-aus) మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా భారత క్రికెట్ జట్టు(team-india) బుధవారం (అక్టోబర్ 15) ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరింది. అక్టోబర్ 19న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు బయలుదేరే ముందు జట్టు సభ్యులు బస్సులో విమానాశ్రయానికి వెళ్తున్న దృశ్యాలను బీసీసీఐ (BCCI) వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రత్యేక పోస్ట్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు కనిపించారు.
అదే సమయంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(rohith-sharma) అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వీడియోలో భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జాతీయ జట్టుతో కలవడం అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పలకరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : కోహ్లీ సంచలన నిర్ణయం!.. RCBకి గుడ్‌బై - షాక్ లో ఫ్యాన్స్
విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ సలాం
BCCI ఈ వీడియోను అప్‌లోడ్ చేసినప్పుడు.. అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది. బస్సు ఎక్కే సమయంలో రోహిత్ శర్మ, అప్పటికే బస్సులో ముందు సీట్‌లో కూర్చుని ఉన్న విరాట్ కోహ్లీని చూసి సరదాగా సెల్యూట్ (సలాం) చేసి, తల వంచి నమస్కరించాడు. ఆ తర్వాత వెంటనే కోహ్లీని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహం, మంచి వాతావరణం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అనంతరం కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కూడా రోహిత్ శర్మ హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shubman Gill hugging Rohit Sharma & Virat Kohli 🥺❤️
— Johns. (@CricCrazyJohns) October 15, 2025
- CUTEST VIDEO OF THE DAY. pic.twitter.com/np7OQFkNau
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న రోహిత్, కోహ్లీపై ఈ సిరీస్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇద్దరూ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయ్యారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో వారి భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. మాజీ కోచ్ రవిశాస్త్రి వంటి వారు కూడా ఈ సిరీస్‌లో వారి ప్రదర్శన భవిష్యత్తు నిర్ణయానికి ముఖ్యమని వ్యాఖ్యానించారు.
Also Read : HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం .. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
సిరీస్ వివరాలు
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో మొదటి వన్డే అక్టోబర్ 19న పెర్త్ లో ఆడనుంది. రెండవ వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ లో, మూడవ వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.