భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (virat kohli) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వార్తలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీతో తన కమర్షియల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడానికి విరాట్ నిరాకరించడని సమాచారం. దీంతో కోహ్లీ RCBకి గుడ్‌బై చెప్పి, IPL నుంచి రిటైర్ అవుతాడేమోనని అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఐపీఎల్ ప్రారంభం (2008) నుంచి విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క ఫ్రాంఛైజీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కే ఆడుతున్న ఏకైక ఆటగాడుగా నిలిచాడు. 2025లో RCB తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇక వన్డే కెరీర్ కు కూడా త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు రావడంతో.. రాబోయే ప్రపంచ కప్ ఆడతాడా లేదా అనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం మరింత గందరగోళానికి దారితీసింది.
🚨 VIRAT KOHLI PLANNING TO RETIRE FROM IPL 🚨
— Pratyush Halder (@pratyush_no7) October 12, 2025
- Kohli has declined to renew a commercial deal linked with RCB ahead of IPL 2026. 😓
- Although he'll continue till the end of this cycle.
- Kohli wants RCB to move ahead without his face. 🥺
[Revsportz]pic.twitter.com/1hR55Rqwq4
ఏం జరిగిందంటే?
కోహ్లీ కమర్షియల్ కాంట్రాక్ట్‌ను రిజెక్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం కమర్షియల్ డీల్‌కు మాత్రమే సంబంధించిన విషయం తప్ప, ప్లేయర్ కాంట్రాక్ట్‌కు కాదని మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ స్పష్టం చేశారు. "కోహ్లీ RCBకి ఆడటానికి కట్టుబడి ఉన్నాడు. అతను బెంగళూరు తరఫునే తన మొదటి, చివరి మ్యాచ్ ఆడతానని అభిమానులకు హామీ చేశాడు. ఆ మాటకు కట్టుబడి ఉంటాడు" అని కైఫ్ ధీమా వ్యక్తం చేశారు.
అలాగే RCB యాజమాన్యంలో మార్పులు వచ్చే అవకాశం ఉండటం లేదా ఇతర కమర్షియల్ అంశాల కారణంగా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా RCB అమ్మకానికి వెళ్తున్నట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద విరాట్ కోహ్లీ IPL నుంచి రిటైర్ అవ్వడం లేదని, అతను RCBతో తన ప్లేయింగ్ కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తాడనే మరికొన్ని వార్తలు అభిమానులకు ఊరటనిస్తున్నాయి. అతడు కేవలం కమర్షియల్ వ్యవహారాలకే తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.