T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లు, ఫార్మాట్ ఇదే..

వచ్చే ఏడాది 2026లో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో ఆడేందుకు 20 జట్లు కవాలిఫై అయ్యాయి. క్వాలిఫయర్‌లో జపాన్‌ను ఓడించి యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నాలుగు గ్రూపుల చొప్పున టీమ్‌లను విభజించి...రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు.

New Update
2026 world cup

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే జట్లు ఖరారు అయ్యాయి. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో ఆడనున్నాయి. చివరి బెర్త్‌ను యూఏఈ దక్కించుకుంది. జపాన్‌ను ఓడించి ఈ స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకు ముందు ఏషియా పసిఫిక్ రీజియన్‌లో ఒమన్, నేపాల్‌లు వరల్డ్‌కప్‌ సాధించేందుకు అర్హత సాధించాయి. 

2026 ప్రపంచకప్‌ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిధ్యం వహించనున్నాయి. ఈ కారణంగా ఇప్పటికే ఈరెండు జట్లూ క్వాలిఫై అయ్యాయి. వీటితో పాటూ ప్రపంచకప్‌లో సూపర్-8కు చేరినందుకు గానూ..  మరో ఏడు జట్లు కూడా క్వాలిఫై అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాప్రికా, వెస్టిండీస్, యూఎస్‌ఏలు వరల్డ్‌కప్‌ ఆడే టీమ్స్‌లో ఉన్నాయి. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ టీమ్స్ క్వాలిఫై అయ్యాయి. మిగతా జట్లు క్వాలిఫయర్ మ్యాచులలో సత్తాచాటి.. ఈ టోర్నీలో ఆడేందుకు అర్హత సాధించాయి.

టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే జట్లు ఇవే..

1. అఫ్ఘానిస్థాన్
2. ఆస్ట్రేలియా
3. బంగ్లాదేశ్
4. కెనడా
5. ఇంగ్లాండ్
6. భారత్
7. ఐర్లాండ్
8. ఇటలీ
9. నమీబియా
10. నేపాల్
11. నెదర్లాండ్స్
12. న్యూజిలాండ్
13. ఒమన్
14. పాకిస్థాన్
15. దక్షిణాఫ్రికా
16. శ్రీలంక
17. యూఏఈ
18. యూఎస్ఏ
19. వెస్టిండీస్
20. జింబాబ్వే

రౌండ్‌ రాబిన్ ఫార్మాట్‌లో..

లాస్ట్ ఇయర్ టీ20 ప్రపంచకప్‌ ఎలా జరిగిందో..వచ్చే ఏడాది కూడా అదే పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం అన్ని టీమ్‌లను కలిపి నాలుగు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉంటాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా నాలుగు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్ స్టేజ్ ముగిసేసరికి టాప్‌లో ఉన్న జట్లు సూపర్-8 కు ఆడతాయి. అక్కడ కూడా ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్టు తమ గ్రూపులోని మిగతా మూడు టీమ్స్‌తో ఆడుతుంది. సూపర్-8లో ఒక్కో గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్ చేరుకుంటాయి.

Also Read: Trump On Pak-Afghan War: ఆ రెండు దేశాల మధ్యా యుద్ధం ఆపడం నాకు చాలా తేలిక..ట్రంప్

Advertisment
తాజా కథనాలు