/rtv/media/media_files/2025/11/03/shafali-2025-11-03-14-26-20.jpg)
Shafali
టీమిండియా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్(ICC Women's World Cup 2025) జట్టును ప్రకటించిన రోజు షఫాలీ వర్మ(shafali-verma) పేరు లేదు. దీంతో అందరూ షాకింగ్‌కు గురయ్యారు. డాషింగ్ ఓపెనర్, లేడీ సెహ్వాగ్‌గా పేరు తెచ్చుకున్న షఫాలీ వర్మ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలు కావడంతో పాటు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే మొదట్లో టీమిండియా జట్టులో ఆమెకు స్థానం కల్పించలేదు. కానీ చివరి నిమిషంలో షఫాలీ వర్మ జట్టులో చేరి టీమిండియాను గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించింది. అయితే సెమీ ఫైనల్స్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ ప్రతికా రావెల్ తీవ్రంగా గాయపడింది.
Chad Shafali Verma
— चिरकुट ज़िंदगी (@Chirayu_Jain26) November 3, 2025
-Didn't get picked in original squad
-Comes in as replacement for Pratika Rawal
-Plays a match winning knock and a brilliant spell in the finals
-Wins the Women's World Cup 2025
-Leaves pic.twitter.com/9Ux8FEXUyJ
రీప్లేస్‌మెంట్‌గా తీసుకుని..
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆమె బాల్ పట్టుకునే సమయంలో గాయపడింది. దీంతో వైద్యులు ఆమెకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. దీంతో ఒక్కసారిగా షఫాలీ వర్మను జట్టులోకి తీసుకున్నారు. కేవలం సెమీ ఫైనల్, ఫైనల్ కోసం ప్రతికా రావెల్‌కు రీప్లేస్‌మెంట్‌గా షఫాలీని బీసీసీఐ జట్టులోకి తీసుకొచ్చింది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొదట షఫాలీ వర్మ మెరిపించింది. కానీ ఆ తర్వాత పది పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో తొందరగా ఔట్ అయిన ఫైనల్‌లో మాత్రం అసలు నిరాశ పెట్టలేదు.
ఇది కూడా చూడండి: BIG BREAKING : ప్రపంచ కప్ విజేత భారత జట్టుకు BCCI భారీ నజరానా
అద్భుతంగా ఆట ఆడి.. టీమిండియా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన కనబరిచింది. స్మృతి మంధానతో కలిసి బ్యాటింగ్ చేసిన షఫాలీ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. షఫాలీ అద్భుత కారణంగానే భారత్ 298 పరుగులు చేసింది. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ షఫాలీ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వద్దని పక్కన పెట్టిన అమ్మాయికే మళ్లీ జట్టులోకి అవకాశం ఇచ్చారు. దీంతో షఫాలీ 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.
ఇది కూడా చూడండి: Harmanpreet Kaur : హ్యాట్సాఫ్ హర్మన్‌ప్రీత్.. గురుభక్తి చాటుకున్న భారత కెప్టెన్!
Follow Us