/rtv/media/media_files/2025/11/03/bcci-india-2025-11-03-07-29-55.jpg)
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. చారిత్రక విజయాన్ని సాధించిన ఉమెన్ ఇన్ బ్లూ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సందర్భంగా ఈ భారీ నజరానాను ప్రకటించారు. సీసీ విజేత జట్టుకు అందించే ప్రైజ్‌మనీ (సుమారు రూ. 39.78 కోట్లు) కంటే ఎక్కువ మొత్తాన్ని బీసీసీఐ ప్రకటించడం విశేషం.
#BCCI Announces Rs 51 Crore Cash Reward For ICC Women's World Cup Winning Team India
— NDTV Profit (@NDTVProfitIndia) November 3, 2025
Read More: https://t.co/69LjvdUCbxpic.twitter.com/jQTWEdRqeH
సమాన గౌరవం, వేతనం అందించాలనే
ఈ 51 కోట్ల రివార్డులో ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది అందరూ భాగస్వాములవుతారు.ఈ భారీ బహుమతిని ప్రకటించడం ద్వారా, పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన గౌరవం, వేతనం అందించాలనే బీసీసీఐ విధానానికి మరోసారి బలం చేకూరినట్లయింది. గతంలో పురుషుల టీ20 ప్రపంచకప్ విజేతలకు ఇచ్చిన ప్రోత్సాహకాలకు సమానంగా లేదా అంతకంటే మెరుగైన బహుమతిని ఇవ్వాలని బోర్డు భావించినట్లు తెలుస్తోంది. ఈ విజయం కేవలం ట్రోఫీ మాత్రమే కాదని, దేశంలోని తదుపరి తరం మహిళా క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుందని, దేశం మొత్తంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీమ్ ఇండియా సాధించిన ఈ అద్భుత విజయం భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫైనల్‌లో వారి ప్రదర్శన స్కిల్, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్‌లకు స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. ‘మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు. ఛాంపియన్లకు అభినందనలు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విన్ చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ చరణి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
Follow Us