Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

New Update
cricket

One day Cricket

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో ఐసీసీ మీటింగ్స్ అవుతున్నాయి. వీటిల్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

Also Read :  అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!

Also Read :  సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

ఒక బంతితోనే..

పదేళ్ల క్రితం వరకు వన్డేలు ఒకే బంతితో ఆడేవారు. బాల్ పాతబడితే రివర్స్ స్వింగ్ బాగా తిరుగుతుంది. అప్పుడు స్పిన్నర్లకు కూడా బంతి మీ పట్టు చిక్కుతుంది. స్పిన్ ను బాగా చేయగలిగే వారు. కానీ పదేళ్ల కితం దీనిని మార్చారు. ఒక్కో ఎండ్‌లో ఒక్కో కొత్త బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ఒక బంతి ఎక్కువలో ఎక్కువ 25 ఓవర్ల వరకే ఉపయోగించగలుగుతున్నారు. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యపడటం లేదు. బంతిని స్పిన్ చేయడం కూడా అవడం లేదు. దీంతో బౌలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లకు ఇది బాగా లాభిస్తున్నా..బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు, వికెట్లు తీయడం లేదనే మాటలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు రెండు బాల్స్ రూల్ ను తీసేయాలని గుంగూలీ కమిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో పాటూ టెస్ట్ లు, టీ20ల్లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

Also Read: AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

Also Read :  పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?

today-latest-news-in-telugu | icc | latest-telugu-news | telugu-news | breaking news in telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
తాజా కథనాలు