Dream11: బీసీసీఐ కీలక నిర్ణయం..   డ్రీమ్‌11 ఔట్!

ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్‌ ఇండియా ప్రధాన స్పాన్సర్‌ అయిన డ్రీమ్‌11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్‌లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్‌షిప్‌ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది.

New Update
bcci

ఆసియా కప్ 2025(Asia cup 2025) కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్‌ ఇండియా ప్రధాన స్పాన్సర్‌ అయిన డ్రీమ్‌11(dream-11) తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్‌లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్‌షిప్‌ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం, డ్రీమ్‌11 వంటి రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన ప్రకటనలు, ప్రమోషన్లు నిషేధించబడ్డాయి. ఈ కారణంగానే డ్రీమ్‌11 తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

Also Read :  Madharaasi Trailer: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!

రూ. 358 కోట్లకు ఒప్పందం

డ్రీమ్‌11 గతంలో బైజూస్ స్థానంలో 2023 జూలైలో రూ. 358 కోట్లకు మూడేళ్ల కాలానికి భారత జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఇంకా ఓ ఏడాది పాటు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయంతో అది మధ్యలోనే ముగిసింది. ఇప్పుడు, ఆసియా కప్ ముంగిట బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో జట్టు స్పాన్సర్ లోగో లేకుండానే టోర్నమెంట్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీసీసీఐకి ఆర్థికంగా కూడా కొంత నష్టం కలిగించవచ్చు.

Also Read : Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) లోని దుబాయ్, అబుదాబి స్టేడియాలలో జరుగుతుంది.వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది, కానీ పాకిస్తాన్‌తో ఉన్న దౌత్యపరమైన సమస్యల కారణంగా UAEలో నిర్వహిస్తున్నారు.ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. రాబోయే 2026 T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి: భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, ఒమన్, హాంకాంగ్. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 9న అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతోంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. గ్రూప్ దశలో ఈ మ్యాచ్ తర్వాత, సూపర్-4 దశలో లేదా ఫైనల్‌లో కూడా ఈ జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.గత ఎడిషన్ (2023 వన్డే ఫార్మాట్)లో భారత్ విజేతగా నిలిచింది. అంతకు ముందు, 2022లో జరిగిన T20 ఫార్మాట్ ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకుంది. 

Also Read :   Stray Dogs: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్.

Advertisment
తాజా కథనాలు