Madharaasi Trailer: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!

శివకార్తికేయన్ లేటెస్ట్  మూవీ 'మదరాశి' వచ్చే నెల సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. 'మదరాశి' ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

New Update

Madharaasi Trailer:  శివకార్తికేయన్ - ఏఆర్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్  మూవీ మదరాశి వచ్చే నెల సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. 'మదరాశి' ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. హీరో శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ మధ్య ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే ట్రైలర్ లో భారీ యాక్షన్ బ్లాక్స్, గన్ ఫైట్స్ ఉత్కంఠగా అనిపించాయి. మురుగదాస్ గత సినిమాల వలే ఇది కూడా మాఫియా, యాక్షన్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విద్యుత్ జమ్వాల్ పవర్ ఫుల్ విలన్ రోల్లో నటించారు. ట్రైలర్ లో అతడి యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్, సిక్స్ ప్యాక్ బాడీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇక అనిరుధ్ రవిచంద్రన్ బీజీఎం ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.

వర.. వర వరదల్లే సాంగ్..

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన వర.. వర వరదల్లే సాంగ్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  అనిరుద్ మరోసారి తనదైన  మార్క్ మ్యూజిక్ తో ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ఈ పాటలో శివకార్తికేయన్ - రుక్మిని వసంత్ మధ్య కెమిస్ట్రీ బాగా అనిపించింది.

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో విద్యుత్ జమ్వాల్ , బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ పలువురు కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ సికిందర్ తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న ఈ సినిమా  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.  సికిందర్ లో మురుగదాస్ తనదైన మార్క్ చూపించలేకపోయారని విమర్శలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ  మదరాశి పైనే పెట్టుకున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న మదరాశి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. పాటలు, ట్రైలర్, పోస్టర్లతో సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ పరాశక్తి సినిమతో రాబోతున్నాడు. సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కేరీర్ మొదలు పెట్టిన .. హీరో కార్తికేయన్ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఎదిగాడు. నటన మాత్రమే కాదు సింగర్ గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేశారు కార్తికేయ. పలు సినిమాల్లో తన స్వరాన్ని వినిపించారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. అటు తమిళ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆమరన్, నవదీప్ దర్శకత్వంలో వచ్చిన డాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

Advertisment
తాజా కథనాలు