MS Dhoni: ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ

తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సెహ్వాగ్‌, సచిన్‌, గంగూలీ, యువరాజ్‌‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నాని ఓ పాడ్‌కాస్ట్‌లో ధోని అన్నాడు. కష్ట సమయాల్లో వీరి ప్రదర్శన మనమంతా చూశాం. అప్పుడు వీరు ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని చెప్పుకొచ్చాడు.

New Update
Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1)

Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni

భారత మాజీ కెప్టెన్ MS ధోని ప్రస్తుతం IPL 2025 సీజన్‌లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. రీసెంట్‌గా ఢిల్లీతో మ్యాచ్ అనంతరం అతడి రిటైర్మెంట్ వార్తలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ ధోనీ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. తన రిటైర్మెంట్ నిర్ణయించేది తాను కాదని.. తన శరీరమని చెప్పుకొచ్చాడు. ఇంకా ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ఎలాంటి ఆలోచన చేయలేదన్నానరు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

అలాగే తనకు ఎదురైన ఓ కఠినమైన ప్రశ్నకు ఆసక్తికర సమధానం ఇచ్చాడు. గతంలో క్రికెటర్లలో ఎవరితో కలిసి మళ్లీ ఆడాలని కోరుకుంటున్నారని ధోనీకి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు అదిరిపోయే సమాధానం చెప్పాడు. గతంలో భారత జట్టులోని 4గురు స్టార్‌ క్రికెటర్లతో మళ్లీ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

మళ్లీ ఛాన్స్ వస్తే

మళ్లీ ఛాన్స్ వస్తే గతంలో భారత జట్టులో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌ వంటి స్టార్ ప్లేయర్లతో తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. వీరూ పా (వీరేంద్ర సెహ్వాగ్‌) ఇన్నింగ్స్‌ ఓపెనింగ్ చేస్తాడు అని తెలిపాడు. అయితే కొన్ని కొన్ని సమయాల్లో పరిస్థితులు చాలా దారుణంగా, క్లిష్టంగా ఉంటాయని.. ఆ సమయంలో ఆటడం చాలా కష్టం అని అన్నాడు. 

Also Read :  మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో దారుణం.. యువతిపై అత్యాచారానికి యత్నించి..

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

అటువంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలి.. ఏ రీతిలో పెర్ఫార్మ్ చేయాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని.. అది అంత సులభం కాదని తెలిపాడు. కానీ ఈ ఆటగాళ్లు అలాంటి క్లిష్ట సమయాల్లో ఎలాంటి ప్రదర్శన చేశారో మనమంతా చూశామని అన్నారు.సెహ్వాగ్, సౌరభ్‌ గంగూలీ ఆడుతుంటే చాలా అందంగా అనిపిస్తుండేదని, ధైర్యంగా ఉండేదని ధోని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

 

ms-dhoni | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు