Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ప్రధాని రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మోదీ అన్నారు. కొందరు నేతలు సంతకాలు తమిళంలో చేయకపోవడంతో ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంతకాలైనా తమిళంలో చేయాలని కోరారు.

New Update
modi tamilanadu meeting

తమిళనాడులో హిందీ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. రామేశ్వరంలోని పాంబన్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. డీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మెడిసిన్ చదువాలనుకుంటున్న విద్యార్థులకు తమిళ భాషలో విద్య అందించాలని.. తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. తమిళ భాష, సంస్కృతిని ప్రపంచ నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొందరు నేతలు సంతకాలను తమిళంలో చేయకపోవడం పట్ల ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం వాటినైనా తమిళంలో చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం నిధులు పెంచినప్పటికీ.. కొందరు డీఎంకే నాయకులు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామన్నారు. 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం యూపీఏ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.600కోట్లు కేటాయించిందన్నారు. ఈరోజు రామేశ్వరంలో ప్రారంభించిన పాంబన్ వంతెన గురించి ఆయన అభివర్ణించారు. మా ప్రభుత్వం దేశానికే గర్వకారణంగా నిలిచే 3 బ్రిడ్జ్‌లను నిర్మించిందని మోదీ అన్నారు. ముంబయిలో సముద్ర వంతెన, జమ్మూకశ్మీర్‌లో చినాబ్‌ వంతెన, పాంబన్‌ వంతెనల గొప్పదనాన్ని వివరించారు. పాంబన్‌ వంతెన నిర్మాణంలో లెటెస్ట్  టెక్నాలజీ వాడమని అన్నారు. ప్రజలకు ట్రాన్స్‌పోర్ట్ పరంగానే కాకుండా ఉపాధి, ఆదాయవృద్ధికి కూడా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుందని చెప్పారు. భారతరత్న అబ్దుల్‌ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరం. తమిళనాడు టెక్నాలజీ, ఆధ్యాత్మికత కలగలిసిన పుణ్యభూమి అని మోదీ పేర్కొన్నారు.

Also read: Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు