Virat Kohli: విరాట్‌ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై రేవంత్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్పందించారు.అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

New Update
CM Revanth and Chandra babu Naidu Responds on Virat Kohli Test Cricket Retirememnt

CM Revanth and Chandra babu Naidu Responds on Virat Kohli Test Cricket Retirememnt

టెస్టు క్రికెట్‌కు స్టార్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో విరాట్‌ ఫ్యాన్స్‌.. అతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భావోద్వేగంతో షేర్ చేస్తున్నారు. కొందరు విరాట్‌ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా విరాట్‌ వీడ్కోలుపై స్పందించారు.  

Also Read: ముగిసిన భారత్‌-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?

అతడి నాయకత్వ లక్షణాలు లక్షలాది మందికి స్పూర్తినిచ్చాయని కొనియాడారు. అలాగే మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. '' విరాట్‌ కోహ్లీ పేరు భారత క్రికెట్‌ చరిత్రలో ఒక గొప్ప పేరుగా నిలిచిపోతుంది. అతడు అద్భుతమైన క్రీడా వాకసత్వాన్ని కొనసాగించాడు. అనేక రికార్డులు సృష్టించాడు. మంచి క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లకు రిటైర్‌ అవుతున్నందున మిగతా ఫార్మాట్లలో విరాట్ మంచి విజయాలు సాధించాలని కోరుతున్నానని'' సీఎం రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు. 

Also Read: పాకిస్తాన్ మంత్రులకు చెమటలు పట్టించిన టీవీ యాంకర్.. ఏం జరిగిందంటే?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. '' టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కొహ్లీ రిటైర్‌మెంట్‌ వల్ల ఇండియన్ క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసిపోయింది. క్రికెట్‌ పట్ల అతడికున్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతోమందిలో స్పూర్తిని నింపాయి. విరాట్ దేశానికే గర్వకారణం. అతడి తదుపరి ప్రయాణం.. విజయపథంలో కొనసాగాలని కోరుతున్నానని'' తెలిపారు. 

Also Read: పాక్‌ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!

telugu-news | rtv-news | virat-kohli | cm revanth | ap cm chandra babu naidu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు