operation sindoor : కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇవాళ భారత్-పాకిస్థాన్ ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (DGMO)లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన DGMOల చర్చలు ముగిశాయి. కాగా హాట్‌లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత్ తరపున డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ నుంచి డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. సుమారు గంటపాటు కొనసాగిన DGMOల చర్చల్లో కాల్పుల విరమణ విధివిధానాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
Also Read: ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!
నిజానికి మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి, సాయంత్రం జరిగిన చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే తదితర అంశాలపై చర్చించారు. పహల్గాం దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 ఉగ్రస్థావరాలపై భారత్ అర్థరాత్రి దాడులు చేసింది. దీంతో పాకిస్థాన్ కవ్వింపు చర్చలకు దిగింది. సరిహద్దుల్లో సామాన్య ప్రజానీకమే లక్ష్యంగా దాడులు చేపట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా జోక్యంతో మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అనంతరం సోమవారం ఇరుదేశాల DGMOలు చర్చించుకోవాలని నిర్ణయించారు. అనుకున్నట్లే ఈ రోజు భారత్-పాక్ దేశాల మధ్య తొలిదశ చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చలు సుమారు గంటపాటు కొనసాగాయి. ఇరు దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలపై చర్చించారు.
ఉగ్రవాదులతోనే మా పోరాటం:
DGMOల చర్చలకు ముందు ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల DGMOలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులతోనే మా పోరాటమన్నారు.మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని, ఉగ్రవాదులు,వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టామన్నారు. కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందన్నారు, ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తున్నందునే మేము పాకిస్తాన్‌పై దాడి చేశామని వెల్లడించారు. ఈ క్రమంలో ఏ నష్టం జరిగిన దానికి బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు.
Also Read: పాకిస్తాన్ను లేపేస్తాం.. ఇండియాకు మా ఫుల్ సపోర్ట్.. BLA సంచలన ప్రకటన!