Rohit Sharma: నన్నెవరేం పీకలేరు.. బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్

ఏం చేసుకుంటారో చేసుకోండి...నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఆడతా అంటున్నాడు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. అత్యంత కష్టమైన బ్రోంకో టెస్ట్ పాస్ అయి తాను ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకున్నాడు. వరల్డ్ కప్ వరకు పక్కా ఆడతానని తేల్చి చెప్పేశాడు.

New Update
bronco

One day Captain Rohith Sharma

మే చివర్లో జరిగిన ఐపీఎల్(IPL 2025) మ్యాచ్ లు ఆడాక రోహిత్ శర్మ(rohit-sharma) ఇప్పటి వరకు మళ్ళీ ఏమీ ఆడలేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ తో జరిగిన వాటికి వెళ్ళలేదు. దీంతో మే నుంచి అతను ఖాళీగానే ఉన్నాడు. అయితే అక్టోబర్ లో ఆస్ట్రేలియా వన్డే సీరీస్ లో ఆడనున్నాడు. అందులో ఆడాలంటే రోహిత్ ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకోవాలి. దీని కోసమే బీసీసీఐ(bcci) రోహిత్ కు ఫిట్ నెస్ పరీక్ష చేసింది. 

Also Read :  టీ20లకు మిచెల్ స్టార్క్ గుడ్ బై

రోహిత్ పిట్ నెస్ పై సందేహాలు..

టీ20 వరల్డ్ కప్(T20 World Cup) గెలిచిన వెంటనే ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు రోహిత్. దాని తరువాత ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ లకు సైతం టాటా బాయ్ బాయ్ అన్నాడు. ఇతన్ని ఫాలో అవుతూ విరాట్ కుూడా నేనూ ఆడను అనేశాడు. దానికి తోడు బీసీసీఐ కూడా యంగ్ ప్లేయర్స్ కే అవకాశాలు అంటూ సంకేతాలు ఇచ్చింది. అలాగే జట్టును కూడా ఎంపిక చేసింది. శుభ్ మన్ గిల్ సారధ్యంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ లు ఆడ్డానికి వెళ్ళిన కుర్రాళ్ళ జట్టు అద్భుతమే చేశారని చెప్పాలి. సీరీస్ గెలవకపోయినా..పడి లేచి డ్రా గా ముగించారు. అసలేమీ చేయలేరు అనుకున్న కుర్రాళ్ళు డ్రా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనే గిల్, పంత్, రాహుల్ లాంటి వాళ్ళు విజృంభించి ఆడడంతో ..సీనియర్లు విరాట్, రోహిత్ లు ఇంక జట్టులోకి శాశ్వతంగా రారు అనేసుకున్నారు అందరూ. వాళ్ళేమీ తమ ఆట గురించి, రిటైర్ మెంట్ గురించీ చెప్పకపోయినా...మిగతా వాళ్ళందరూ మాత్రం తెగ చర్చించేసుకున్నారు. అంతా కామ్ గా చూసిన రోహిత్, విరాట్ లు నెమ్మదిగా తాము ఎక్కడికీ వెళ్ళిపోలేదు...వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకూ టీమ్ లోనే ఉంటామని సంకేతాలిచ్చారు. బీసీసీఐ కూడా అంతా వాళ్ళిష్టమే అని స్పష్టంగా చెప్పేసింది. మే తరువాత ఫుల్ రెస్ట్ లో ున్న ఇద్దరు ఆటగాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా వన్డే సీరీస్ కూడా రెడీ అయిపోయారు. ఈ క్రమంలో విరాట్ ఫిట్ నెస్ గురించి ఎవరికీ సందేహాలు రానప్పటికీ కెప్టెన్ రోహిత్ గురించి మాత్రం మాట్లాడుకున్నారు. బీసీసీఐ కూడా అతన్ని పరీక్షకు పిలిచింది. 

కెప్టెప్ రోహిత్ కు బీసీసీఐ అత్యంత కష్టమైన బ్రోంకో టెస్ట్ నిర్వహించింది. ఇందులో మన హిట్ మ్యాన్ సక్సెస్ ఫుల్ గా పాస్ అయిపోయాడు. ఇది కొంచెం చర్చనీయాంశం అయింది కూడా. రోహిత్ ను డైరెక్ట్ పొమ్మనలేకే ఈ బ్రోంకో టెస్ట్ ను చేస్తోందని ఆరోపించారు కూడా. అయితే రోహిత్ మాత్రంఏం మాట్లాడకుండా టెస్ట్ కు హాజరయ్యాడు. తన లో సత్తా ఇంకా చాలవలేదని..తననెవరూ ఏం చేయలేరని నిరూపించుకున్నాడు. దీన్ని బట్టి వన్డేలు ఆడడానికి ఎంత పట్టుదలగా ఉన్నాడనేది రుజవవుతోంది. క్రితంసారి చేతుల్లోకి వచ్చి జారి పోయి వన్డే వరల్డ్ కప్ ను నెక్స్ట్ టైమ్ ఎలా అయినా కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ లు. దాని కోసమే మిగతా ఫార్మాట్ లు అన్నింటికీ గుడ్ బై చెప్పేసినా...వన్డేల్లో మాత్రం కొనసాగాలని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టు తన ఫిట్ నెస్ లను కూడా ఇప్పుడు నిరూపించుకున్నారు. ఇక రోహిత్ ను ఎవరూ ఏం చేయలేరు అనేది మాత్రం పక్కా. 

Also Read:  Trump Vs India: పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

Advertisment
తాజా కథనాలు