/rtv/media/media_files/2025/09/02/aus-2025-09-02-07-09-18.jpg)
ఆస్ట్రేలియా(Australia) ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(mitchell-starc) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్(t20-world-cup) కు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మిచెల్ స్టార్క్ వెల్లడించాడు. స్టార్క్ తన ప్రకటనలో టెస్ట్ క్రికెట్‌కు తన కెరీర్‌లో ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Breaking: Australian men’s fast bowler Mitchell Starc has announced his retirement from T20 International cricket to focus on his Test and ODI career. pic.twitter.com/WbCUanoo20
— RevSportz Global (@RevSportzGlobal) September 2, 2025
Also Read : స్పాన్సర్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ కావాల్సిందే!
23.81 సగటుతో 79 వికెట్లు
రాబోయే భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచ కప్‌లకు సిద్ధం కావడానికి ఇది ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డాడు. స్టార్క్ తన ప్రకటనలో టెస్ట్ క్రికెట్‌కు తన కెరీర్‌లో ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాగా 35 ఏళ్ల మిచెల్ స్టార్క్ 23.81 సగటుతో 79 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ నిలిచారు. 2021లో ఆస్ట్రేలియా పురుషుల T20 ప్రపంచ కప్ గెలవడంలో మిచెల్ స్టార్క్ కీరోల్ పోషించాడు. స్టార్క్ రిటైర్మెంట్‌తో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు.
వికెట్ కీపర్‌గా ప్రారంభించి
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, స్టార్క్ తన క్రికెట్ కెరీర్‌ను వికెట్ కీపర్‌గా ప్రారంభించారు. అయితే, కోచ్ సలహా మేరకు అతను ఫాస్ట్ బౌలింగ్‌పై దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. ఈ మార్పు అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో స్టార్క్ ఒకరు. 2015లో అతను న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 160.4 కి.మీ/గం వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించారు. స్టార్క్ భార్య అలీసా హీలీ కూడా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. క్రికెట్ ప్రపంచంలో ఒకే దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మూడో జంట వీరు. స్టార్క్ సోదరుడు బ్రాండన్ స్టార్క్ కూడా ఒక ప్రొఫెషనల్ అథ్లెట్. అతను హై జంపర్‌గా ఆస్ట్రేలియా తరపున ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ICC ట్రోఫీ గెలిచిన ఐదుగురు ఆటగాళ్లలో స్టార్క్ ఒకరు. 2015, 2023 వన్డే ప్రపంచ కప్‌లు, 2021 టీ20 ప్రపంచ కప్ , 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టులో ఆయన ఒక ముఖ్యమైన సభ్యుడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని $2.98 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన ఆటగాడిగా స్టార్క్ రికార్డు సృష్టించారు.
Also Read : PM Modi : పుజారా రిటైర్మెంట్.. ప్రధాని మోదీ అభినందన లేఖ