Trump Vs India: పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

భారత్ తో సంబంధాలు తెంచుకోవడంపై ఇప్పటికే చాలా మంది అమెరికా మాజీలు, అధికారాలు ట్రంప్ ను తిడుతున్నారు. తాజాగా అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్.. ట్రంప్ చేసింది వెధన పని అంటూ తిట్టిపోశారు. సొంత వ్యాపారాల కోసం భారత్ తో గొడవ పెట్టుకున్నారన్నారు.

New Update
JK Sullivan

Jake Sullivan served as the US National Security Advisor from 2021 to 2025 under President Joe Biden

అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయి ఉండీ దానికి తగ్గట్టు ప్రవర్తించకుండా ట్రంప్ తన స్వలాభం చూసుకున్నారని ఆరోపిస్తున్నారు అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్. తన కుటుంబ వ్యాపారాల కోసం భారత్ తో సంబంధాలు తెంచుకున్నారన్నారు. పాకిస్తాన్ లో ట్రంప్ కుటుంబం క్రిప్టో వెంచర్ చేస్తోంది. అక్కడ అది జరగాలంటే పాక్ తో సంబంధాలు మెరుగు పరుచుకోవాలి. అదే సమయంలో భారత్ తో గొడవ పెట్టుకోవాలి. ట్రంప్ ఆ పనే చేశారు. పాకిస్తాన్ తో రాసుకుపూసుకుని తిరుగుతున్నది ఇందుకే అని చెప్పుకొచ్చారు సుల్లివన్. 

తన కుటుంబ వ్యాపారాల కోసమే..

భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవడం ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పని సుల్లివన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకు విదేశాంగ విధానం అస్సలు తెలియదు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణని అన్నారు. దశాబ్దాలుగా భారత్ తో అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఒక్క దెబ్బతో వాటన్నింటినీ ట్రంప్ పాడుచేశారని సుల్లివన్ ఆరోపించారు. టెక్నాలజీ, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలమైన చైనాను ఎదుర్కోవాలంటే భారత్ తో మంచి సంబంధాలు ఉండాల్సిందేనని చెప్పారు. అది కనుక లేకపోతే చైనాను ఎదుర్కోలేరని అన్నారు. కానీ ట్రంప్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. కేవలం తన కుటుంబ వ్యాపారాల కోసమే ఆలోచిస్తున్నారు.

పహల్గామ్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ కుటుంబ మద్దతుగల వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది . పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ (పిసిసి)ని ఏప్రిల్ 26న ఇస్లామాబాద్ ప్రారంభించింది. దీని ద్వారా దేశాన్ని దక్షిణాసియా క్రిప్టో హబ్‌గా మార్చాలని అనుకుంటోంది. అందుకే పిసిసి వికేంద్రీకృత ఆర్థిక వేదిక అయిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ (డబ్ల్యూఎల్ఎఫ్)తో ఒప్పందంపై సంతకం చేసింది. ఇదంతా ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ అని తెలిపారు. దాని కోసమే పాకిస్తాన్ తో ఒప్పందాలు చేసుకుంటున్నారని సుల్లివన్ వివరించారు.   మరోవైపు ఆ దేశం కూడా తాము బాగుపడడానికి అమెరికాను ఉపయోగించుకుంటోంది. అందుకే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేశారని అంటున్నారు.  ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అమెరికాకు చాలా చేటును చేస్తాయని సుల్లివన్ చెబుతున్నారు. అమెరికన్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు మంచిది కాదని చెబుతున్నారు.

అమెరికాను లెక్క చేయని చైనా..

ట్రంప్ మొదట టారిఫ్ ల ఆట చైనాతో మొదలెట్టారు. కానీ ఆ దేశం తిరగబడే సరికి తగ్గారు ఎప్పటికైనా వారిదే ఆధిపత్యం అని చెబుతున్నారు అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్.  తాను రీసెంట్ గా అమెరికా వెళ్ళాలనని..అక్కడ అమెరికాను అసలు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వారు యూఎస్ ను చాలా చులకన చేస్తున్నారు. అది అసలు తమకు పోటీయే కాదన్న భావనలో ఉన్నారని చెప్పారు. చాలా దేశాలు అమెరికా కంటే ముందు వరుసలో ఉన్నాయని చెబుతున్నారు. చైనా, భారత్, రష్యా అధ్యక్షులు సమావేశం, ఆ  మూడు దేశాలు ఏకమవ్వడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య సుల్లివన్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 

Also Read: Trump Health: అయ్యో ట్రంప్ కు ఏమైంది..ఇలా మారిపోయారేంటీ..కలకలం సృష్టిస్తున్న లేటెస్ట్ పిక్స్..

Advertisment
తాజా కథనాలు