Asia Cup 2025: మరో 24 గంటల్లో ఆసియా కప్ ప్రారంభం.. ఆ క్రికెటర్లు ఔట్.. బరిలోకి దిగే ఫైనల్ టీమిండియా జట్టు ఇదే!

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో సంజూ శాంసన్, రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు లభించదని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్‌కు జట్టులోకి అవకాశం లేదని సమాచారం.

New Update
Asia Cup

Asia Cup

యూఏఈ(UAE) వేదికగా ఆసియా కప్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10వ తేదీన ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో బరిలోకి దిగే టీమిండియా ఫైనల్ జట్టు ఏదనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంజూ శాంసన్, రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు లభించదని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్‌కు జట్టులోకి అవకాశం లేదని సమాచారం.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: ఆసియా కప్ 2025కు టీమిండియా రెడీ.. గౌతమ్ గంభీర్ మాస్ స్పీచ్..! (వీడియో)

ఆసియా కప్‌(Asia Cup 2025) లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ  ఓపెనింగ్  చేస్తారని తెలుస్తోంది. మూడో ప్లేస్‌లో తిలక్ వర్మ్ కొనసాగనున్నట్లు సమాచారం. ఇక సూర్య కుమార్ యాదవ్(surya-kumar-yadav), హార్డిక్ పాండ్యా, జితేష్ శర్మ, శివమ్ దూబే  మిడిలార్డర్‌లో ఆడుతారు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లు పేసర్లుగా బరిలోకి దిగనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈసారి టీమిండియా విత్ ఔట్ స్పాన్సర్ జెర్సీతోనే బరిలోకి దిగనుంది. అలాగే ఈ ఆసియా కప్‌లో భారత్ విన్నర్ అవుతుందని, శ్రీలంక రన్నరప్ అవుతుందని ఆకాష్ చోప్రా తన ప్రిడిక్షన్‌లో తెలిపాడు. ఈ ఆసియా కప్‌లో మెస్ట్ రన్స్ కొట్టేది శుభ్‌మన్ గిల్, ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తి వరుణ్ చక్రవర్తి అని ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.

ఆసియా కప్ 2025 బరిలోకి దిగే ఫైనల్ భారత జట్టు..

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు.. ఆసియా కప్ 2025లో విజయం

Advertisment
తాజా కథనాలు