/rtv/media/media_files/2025/09/07/gautam-gambhir-gave-special-message-to-team-india-asia-cup-2025-2025-09-07-17-12-52.jpg)
gautam gambhir gave special message to team india asia cup 2025
ఆసియా కప్ 2025 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 9 నుండి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా యూఏఈ చేరుకుంది. అక్కడ భారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జట్టులోని ఆటగాళ్లందరూ కష్టపడి చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలోనే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భారత ఆటగాళ్లకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బిసిసిఐ షేర్ చేసింది.
https://www.bcci.tv/bccilink/videos/x5qdL22f
Asia Cup 2025
BCCI షేర్ చేసిన వీడియోలో.. గంభీర్ భారత ఆటగాళ్లతో మాట్లాడిన విషయాలను క్రికెటర్ శివం దూబే చెప్పాడు. కోచ్ ఎల్లప్పుడూ ప్రతి ఆటగాడికి ఒక విషయం చెబుతాడని అన్నాడు. ‘‘దేశం కోసం ఆడే ప్రతిసారి, మీరు ఏదైనా కొత్తగా చేయగల అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’’ అని గౌతమ్ గంభీర్ చెప్పినట్లు శివమ్ దూబే వెల్లడించాడు. అనంతరం శివమ్ దూబే మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు అందరి దృష్టి జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంటుంది. అతను 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతదేశం తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు.
𝙍𝙚𝙘𝙝𝙖𝙧𝙜𝙚𝙙 𝘼𝙣𝙙 𝙍𝙚𝙛𝙧𝙚𝙨𝙝𝙚𝙙! ⚡️💪#TeamIndia raring to GO! 👏 👏
— BCCI (@BCCI) September 6, 2025
WATCH 🎥🔽 #AsiaCup2025https://t.co/9hKXSyrnK0
ఇప్పుడు యువ టీమ్ ఇండియాలో భాగం కావడం సంతోషంగా ఉందని జస్ప్రీత్ తెలిపాడు. ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత నేను T20I జట్టులో చేరాను. ఈ మూడు వారాల సమయం ఎంతో బాగుంది. ఇంట్లో కొంత సమయం గడపడానికి అవకాశం లభించింది. ఈ జట్టులో కొంతమంది యువ ఆటగాళ్ళు, యువ శక్తి ఉన్నారు. కాబట్టి రాబోయే సమయం ఉత్సాహంగా ఉంటుంది.’’ అని తెలిపాడు. దీంతో అతడి వ్యాఖ్యలు క్రికెట్ ప్రియుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
ఇదిలా ఉంటే ఈ టోర్నీలో పాల్గొనడానికి 8 జట్లు సిద్ధంగా ఉన్నాయి. అందులో భారత్, పాకిస్తాన్, ఒమన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఇలా మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 10న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను యుఎఇతో ప్రారంభించనుంది.
Preps in full swing 💪
— BCCI (@BCCI) September 7, 2025
The countdown to 𝙈𝙖𝙩𝙘𝙝 𝘿𝙖𝙮 begins ⏳#TeamIndia | #AsiaCup2025pic.twitter.com/3SC57XILxD
టీమిండియా జట్టు విషయానికొస్తే.. సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్)తో పాటు అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు.
Asia Cup schedule
9 సెప్టెంబర్: అఫ్గానిస్థాన్ - హాంకాంగ్
10 సెప్టెంబర్: భారత్ - UAE
11 సెప్టెంబర్: బంగ్లాదేశ్ - హాంకాంగ్
12 సెప్టెంబర్: పాకిస్థాన్ - ఒమన్
13 సెప్టెంబర్: బంగ్లాదేశ్ - శ్రీలంక
14 సెప్టెంబర్: భారత్ - పాకిస్థాన్
15 సెప్టెంబర్: శ్రీలంక - హాంకాంగ్
16 సెప్టెంబర్: బంగ్లాదేశ్ - అఫ్గానిస్థాన్
17 సెప్టెంబర్: పాకిస్థాన్ - యూఏఈ
18 సెప్టెంబర్: శ్రీలంక - అఫ్గానిస్థాన్
19 సెప్టెంబర్: భారత్ - ఒమన్
సూపర్ 4
20 సెప్టెంబర్: Group B క్వాలిఫయర్ 1 - Group B క్వాలిఫయర్ 2
21 సెప్టెంబర్: Group A క్వాలిఫయర్ 1 - Group A క్వాలిఫయర్ 2
23 సెప్టెంబర్: Group A క్వాలిఫయర్ 1 - Group B క్వాలిఫయర్ 2
24 సెప్టెంబర్: Group B క్వాలిఫయర్ 1 - Group A క్వాలిఫయర్ 2
25 సెప్టెంబర్: Group A క్వాలిఫయర్ 2 - Group B క్వాలిఫయర్ 2
26 సెప్టెంబర్: Group A క్వాలిఫయర్ 1 - Group B క్వాలిఫయర్ 1
ఫైనల్
28 సెప్టెంబర్ : ఫైనల్ మ్యాచ్