/rtv/media/media_files/2025/09/16/asia-cup-2025-09-16-07-57-26.jpg)
Asia Cup
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా సోమవారం ఒమన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 42 పరుగులు తేడాతో గెలిచింది. భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత యూఏఈ ఈ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో యూఏఈ 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఈ జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఆఫ్ సెంచరీలు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఓపెనర్ అయిన కెప్టెన్ ముహమ్మద్ వసీం 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అతనికి తోడుగా మరో బ్యాట్స్‌మెన్ అలిషన్ షరఫు 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం యూఏఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత చివర్లో వచ్చిన ముహమ్మద్ జోహైబ్ 13 బంతుల్లో 21 పరుగులు, హర్షిత్ కౌషిక్ కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒమన్ బౌలర్లలో జితెన్ రమనంది 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. హస్‌నైన్ షా, సామ్య శిరవస్తవా తలో ఒక వికెట్ తీశారు.173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు, యూఏఈ బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. 18.4 ఓవర్లలో కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలైంది. ఒమన్ తరపున జతిందర్ సింగ్ (20), ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20) మాత్రమే కాస్త పర్వాలేదనిపించే స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
ఇది కూడా చూడండి: Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు
India Qualify For Super 4 Of Asia Cup 2025 With One Match Left; Pakistan In Must-Win Situationhttps://t.co/ztp3f51yPD
— Times Now Sports (@timesnowsports) September 15, 2025
అధిక రన్‌రేట్ ఉండటం వల్ల..
యూఏఈ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా, జునైద్ సిద్దిఖ్ 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ఒమన్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. హైదర్ అలీ మరియు ముహమ్మద్ జవదుల్లా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ముహమ్మద్ రోహిద్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ ఓటమితో ఒమన్ జట్టు సూపర్ 4 రేసు నుంచి పూర్తిగా తప్పుకుంది. అయితే సూపర్ 4 రేసులో పాకిస్థాన్ చేరడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే భారత్ మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉంది. సూపర్ 4 బెర్త్‌ను భారత్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఒమన్‌తో ఓడినా కూడా మెరుగైన రన్‌రేట్ ఉండటం వల్ల భారత్‌కు ఎలాంటి సమస్య ఉండదు. అయితే భారత్ తర్వాత పాకిస్తాన్ జట్టు రెండో స్థానంలో ఉంది. భారత్‌తో ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, ఒమన్‌పై గెలిచింది. ఇప్పుడు యూఏఈతో చివరి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తేనే సూపర్4కు చేరనుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం లీగ్ దశలోనే పాక్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. యూఏఈ గెలవడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ డేంజర్‌లో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందో లేదో చూడాలి.
ఇది కూడా చూడండి: World Championship: వరల్డ్ ఛాంపియన్ షిప్ స్పీడ్ స్కేటింగ్ లో రెండు బంగారు పతకాలు..