Amit Shah: కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్‌ నుంచి 16 వేల మంది విదేశీయులు ఔట్ !

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించనుంది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దేశంలో ఇటీవల కొత్త వలస చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Amit Shah

Amit Shah

కేంద్ర ప్రభుత్వం(Central Government) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించనుంది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దేశంలో ఇటీవల కొత్త వలస చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్‌ రవాణా అలాగే ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16 వేల మంది విదేశీయులు భారత్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లందిరినీ వివిధ ప్రాంతాల్లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. 

Also Read: నుపూర్‌ బోరా ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం..ఎక్కడివో తెలుసా?

ప్రస్తుతం వాళ్లు నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారని.. వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు కఠినంగా శిక్షించే కొత్త చట్టాన్ని సెప్టెంబర్‌ 2న అమల్లోకి తీసుకొచ్చారు. వలసలు, విదేశీయుల చట్టం 2025గా ఉన్న దీన్ని బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఆమోదించింది. ఏప్రిల్ 4న రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. నాలుగు పాత చట్టాల స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 

Also Read: వచ్చేస్తున్న మోదీ క్రెడిట్ కార్డు..  వడ్డీ లేకుండా వ్యాపారులకు రూ.5 లక్షలు!

Foreigners Involved In Narcotics Trafficking

ఇందులో భాగంగానే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో భారత్‌(India) లోకి వచ్చిన విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అలాగే రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. కానీ పేదరికంలో ఉన్నవాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. పేదరికాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వాలు రూ.కోట్ల నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా పరిస్థితులు మారడం లేదు.   

Also Read: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడిపై ఇస్లాం దేశాల సీరియస్.. రక్త దాహాన్ని అడ్డుకోవాలని తీర్మానం

పేదరికాన్ని పరిష్కరించే విషయంలో ముఖ్యంగా అక్రమ వలసలు ప్రధాన అడ్డుగోడలుగా ఉన్నాయి. సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా వచ్చిన విదేశీయులు చట్టవిరుద్ధంగా ఉంటున్నారు. అలాగే వీళ్లు అసలైన లబ్ధిదారులకు రావాల్సిన సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ద్వారా దేశం నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. 

Also Read: పాకిస్థాన్‌ అణు స్థావరాలను నాశనం చేసే ప్రణాళిక.. భారత్‌కు ఇజ్రాయెల్‌ బంపర్ ఆఫర్‌ !

Advertisment
తాజా కథనాలు