BIG BREAKING: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు!
తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.