/rtv/media/media_files/2026/02/03/majid-2026-02-03-17-57-27.jpg)
పాకిస్థాన్(pakistan) లో మరోసారి తిరుగుబాటు మంటలు రేగుతున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు(Balochistan Attack On Pakistan) ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ హెరోఫ్ 2.0 పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. బలోచ్ పోరాట యోధులు ఒక్కసారిగా పలు నగరాలపై విరుచుకుపడి, పోలీస్, ఆర్మీ పోస్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాక్ సైన్యం దిక్కుతోచని స్థితిలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఈ భారీ ఆపరేషన్‌లో బలోచ్ ఆర్మీకి చెందిన మూడు ప్రధాన యూనిట్లు— మజీద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్, STOS— కలిసి పనిచేశాయి. అయితే, వీటన్నింటిలో అత్యంత భయంకరమైనది 'మజీద్ బ్రిగేడ్'. ఈ దళం తన ఆత్మాహుతి దాడులతో (Suicide Attacks) పాక్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ ఆపరేషన్‌లో మహిళా పోరాట యోధులు కూడా కీలక పాత్ర పోషించారు. హవా బలోచ్, అసిఫా మెంగల్ అనే మహిళా ఫిదాయీలు బాంబులతో నింపిన వాహనాల ద్వారా గ్వాదర్ మరియు నుష్కీలోని ISI (ఐఎస్ఐ), CTD స్థావరాలపై దాడులు చేశారు. ఈ పోరులో మజీద్ బ్రిగేడ్‌కు చెందిన 11 మంది ఆత్మాహుతి సభ్యులతో సహా మొత్తం 18 మంది చనిపోయారు. కాగా, అమెరికా 2025లోనే మజీద్ బ్రిగేడ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ సైన్యం పేరు వింటేనే గజగజ వణికిపోయే ఈ మజీద్ బ్రిగేడ్ 2011లో ఏర్పడింది. ఇది బలోచ్ ఆర్మీలోని ఒక ప్రత్యేక విభాగం. వీరి ప్రధాన లక్ష్యం ఆత్మాహుతి దాడుల ద్వారా శత్రువును దెబ్బతీయడం. 2020లో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మీద దాడి, 2024లో కరాచీ విమానాశ్రయం బయట ఆత్మాహుతి దాడి. ఇలాంటి అనేక భారీ దాడుల వెనుక ఈ బ్రిగేడ్ హస్తం ఉంది.
Also Read : టారిఫ్‌ల తగ్గింపు... కీ రోల్ ప్లే చేసిన ఈ అమెరికా రాయబారి ఎవరు?
ఇద్దరు అన్నదమ్ముల గుర్తుగా
ఈ బ్రిగేడ్‌కు ఆ పేరు వెనుక ఒక చరిత్ర ఉంది. BLA మాజీ నేత అస్లాం అచూ 2010-11 కాలంలో దీనిని ప్రారంభించారు. మజీద్ లంగోవ్ సీనియర్, మజీద్ లంగోవ్ జూనియర్ అనే ఇద్దరు అన్నదమ్ముల గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. 1974లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోపై దాడికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. 2010లో పాక్ భద్రతా దళాల ఆపరేషన్‌లో మరణించారు. వారి త్యాగాలకు గుర్తుగానే ఈ ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బ్రిగేడ్ చేస్తున్న దాడులు పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Also Read : అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ బిగ్ షాక్!
Follow Us