Jeevan Reddy : అసలైన కార్యకర్తలకు టికెట్లు దక్కలేదు..మాజీమంత్రి జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదని, వలసవాదులకే సీట్లు దక్కాయని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ రోజు ఆయన జగిత్యాల లో ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడారు.

New Update
jeevan reddy

Jeevan Reddy

Jeevan Reddy :  జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదని, వలసవాదులకే సీట్లు దక్కాయని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ రోజు ఆయన జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్ లో విలేకరులతో మాట్లాడారు. పార్టీలో తనది నాలుగు దశాబ్ధాల చరిత్ర అన్న జీవన్‌ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగిత్యాల కు వచ్చిన సందర్భంగా ఒక మిత్రుడు పార్టీ లైన్ దాటకూడదు అంటున్నాడు. అసలు ఇపుడు పార్టీ లైన్ దాటింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు?
 
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ర్టంలో బీఆర్‌ఎస్‌ ప్రభావం కొనసాగుతున్నా జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించుకున్నామని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ జండా భుజాన పెట్టుకొని దశబ్ద కాలంగా కార్యకర్తలు పార్టీని ముందుకు నడిపించారు..అలాంటి కార్యకర్తలు కౌన్సిలర్ టికెట్ ను తమ హక్కు గా భావిస్తారన్నారు. క్రింది స్థాయి కార్యకర్తలకు పెద్ద కోరికలు ఉండవు కనీసం కౌన్సిలర్ గా ఉండాలని కోరుకోవటం లో తప్పు లేదని ఆయన అన్నారు. కాగా నన్ను లిస్ట్ అడిగితే నేను జగిత్యాల, రాయికల్ సంబంధించి కార్యకర్తల లిస్ట్ పంపించానని..వారంతా జండా మోసిన కార్యకర్తలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలే అని జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కానీ వారికి టికెట్‌ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పంపిన లిస్ట్‌ ప్రకారం టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.

కాంగ్రెసు పార్టీ నిబద్ధత గల పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుంది. కానీ, రాహుల్ గాంధీ నినాదాలతో పూర్తిగా వ్యతిరేకంగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేశాను..మీకు అభ్యంతరాలు ఉంటే అందరిని కూర్చోపెట్టి నిర్ణయం తీసుకోవాలి..కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ లో గెలిచిన వ్యక్తి తో మాట్లాడి అతని అభిప్రాయాన్ని తీసుకొని లిస్ట్ ఎలా తయారు చేస్తారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.కార్యకర్తల హక్కులను కాపాడవలసిన బాధ్యత తనపై ఉందన్న జీవన్‌రెడ్డి వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టంచేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి..రాహుల్ గాంధీ దేశం అంత జై బాపు, జై బీమ్ జై సమ్మీదాన్  పేరుతో తిరిగితే మీరు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

Advertisment
తాజా కథనాలు