/rtv/media/media_files/2026/02/03/maharashtra-2026-02-03-16-22-39.jpg)
మహారాష్ట్ర(maharashtra) మాజీ డిప్యూటీ సీఎం, దివంగత నేత అజిత్ పవార్ అంత్యక్రియల(Ajit Pawar's Funeral) వద్ద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. విమాన ప్రమాదంలో మరణించిన పవార్‌కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలిరాగా, ఆ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు.
జనవరి 29న బారామతిలో జరిగిన అజిత్ పవార్ అంత్యక్రియల సమయంలో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చేపట్టి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజ్‌కుమార్ బాబూరావు, మొహమ్మద్ అనీస్, ఐజాజ్ మిరావాలే సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అంత్యక్రియలకు వచ్చిన రంజిత్ జాదవ్, విశ్వజిత్ తుపే వంటి ప్రముఖుల మెడలోని బంగారు గొలుసులు, జేబుల్లోని నగదును ఈ ముఠా మాయం చేసింది. టెక్నికల్ ఆధారాలు రహస్య సమాచారంతో పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుండి చోరీ సొత్తును రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read : యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్..
ముఖ్యమంత్రి లాడ్కీ బహిన్ యోజన
మరోవైపు, అజిత్ పవార్‌కు నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం 'ముఖ్యమంత్రి లాడ్కీ బహిన్ యోజన' పేరును మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిట్కరీ స్పందిస్తూ.. "అజిత్ దాదా రాష్ట్రంలోని మహిళలందరికీ ఇష్టమైన సోదరుడు. ఆయన ప్రయాణాల్లో మహిళలు ఆయన చేతికి లెక్కలేనన్ని రాఖీలు కట్టేవారు. కాబట్టి ఈ పథకానికి 'అజిత్ దాదాంచి లాడ్కీ బహిన్' అని పేరు పెడితేనే ఆయనకు నిజమైన నివాళి" అని పేర్కొన్నారు.
అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2024 జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద 21 నుండి 65 ఏళ్ల వయస్సు గల అర్హులైన మహిళలకు నెలకు ₹1,500 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.
BJP Targets : మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ మాస్టర్ ప్లాన్..ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి
Follow Us