Israel: శత్రు దేశాలే టార్గెట్.. మరో సంచలన ఆయుధాన్ని తయారుచేసిన ఇజ్రాయెల్
రక్షణ వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు ఇజ్రాయెల్ కీలక అడుగులు వేస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త లేజర్ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.