శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ కలకలం.. ఇస్త్రీ పెట్టెలో ఇంత బంగారమా..?
శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం గోల్డ్ స్మగ్లింగ్ కలకలం రేపింది. 3.38 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్‌లో బంగారం దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశారు.