Mahesh kumar Goud : పవన్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి:  మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్

జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. పవన్‌ కల్యాణ్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకి అని, ఆయన మాటలు కేవలం విభజన రాజకీయాలకే పనికొస్తాయంటూ మండిపడ్డారు. 

New Update
mahesh

జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(mahesh-kumar-goud) కీలక కామెంట్స్ చేశారు. పవన్‌ కల్యాణ్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకి అని, ఆయన మాటలు కేవలం విభజన రాజకీయాలకే పనికొస్తాయంటూ మండిపడ్డారు. 

గాంధీ భవన్‌లో మీడియాతో మహేష్‌ కుమార్ గౌడ్  మాట్లాడుతూ..   "పవన్‌ కల్యాణ్.. నీ రాజకీయాలు ఏవైనా ఉంటే ఆంధ్రాలో చూసుకో, తెలంగాణ గడ్డపై నీ పప్పులు ఉడకవు" అని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గతంలో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని, అందుకే ఆయన పేరు పవన్ కాదని, ఆయనో దిష్టి కల్యాణ్ అని ఎద్దేవా చేశారు.

Also Read :  మీరు మాట్లాడరా ... మంత్రులపై సీఎం రేవంత్ సీరియస్!

బీజేపీ నేతలు పవన్‌ను అడుక్కునే స్థితికి

తెలంగాణలో సొంతంగా బలం లేని బీజేపీ, పవన్‌ కల్యాణ్ నామజపాన్ని నమ్ముకుంటోందని మహేష్‌ గౌడ్ విమర్శించారు. "తెలంగాణలో కనీసం ఉనికి చాటుకోవడానికి బీజేపీ నేతలు పవన్‌ను అడుక్కునే స్థితికి దిగజారారు. పవన్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, వారు మళ్ళీ మళ్ళీ మోసపోరు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పవన్‌ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధిని గానీ, ఇక్కడి రైతుల ఇబ్బందులను గానీ పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల సమయంలో విపక్షాలకు సపోర్ట్ చేయడానికి మాత్రమే వస్తారని మహేష్ గౌడ్ ఆరోపించారు. మతం పేరుతో, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టే రాజకీయాలను తెలంగాణ సమాజం సహించదని ఆయన తేల్చి చెప్పారు.

Also Read :  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌.. ఆ పార్టీ కోసం ప్రచారం

Advertisment
తాజా కథనాలు