Ustaad Bhagat Singh : అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్!..  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రిలీజ్ డేట్ ఖరారైంది.

New Update
pawan kalyan

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌(Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ ఏడాది సమ్మర్ రేసులో ఫస్ట్ బిగ్గీగా ఈ సినిమా నిలవబోతోంది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Also Read :  హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎర్రన్న వారసుడు.. ‘ఓ టార్చర్ ప్రేమ’ టైటిల్ పోస్టర్ రిలీజ్

నిజానికి, మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, షూటింగ్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ‘పెద్ది’ రిలీజ్ వాయిదా పడింది. అబ్బాయ్ ఖాళీ చేసిన ఆ డేట్‌ను బాబాయ్ పవన్‌ కల్యాణ్ తన ‘ఉస్తాద్’(Ustaad Bhagat Singh) కోసం లాక్ చేసేశారు. ఒక రకంగా చెప్పాలంటే, సమ్మర్ సీజన్‌ను పవన్‌ కల్యాణ్ తన మాస్ యాక్షన్‌తో గ్రాండ్‌గా ఓపెన్ చేయబోతున్నారు.

Also Read :  Grammy Awards 2026: వేదికపై సంచలనం సృష్టించిన చాపెల్ రోన్ టాప్‌లెస్‌ బోల్డ్ లుక్!

ఏప్రిల్ 30న పెద్ది

బాబాయ్ కోసం అబ్బాయ్ తన సినిమాను ఏకంగా ఒక నెల వెనక్కి జరిపారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ ఇప్పుడు ఏప్రిల్ 30న విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద బాబాయ్-అబ్బాయ్ పోటీ పడటం ఇష్టం లేకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల మార్చిలో పవన్, ఏప్రిల్‌లో చరణ్.. ఇలా వరుసగా రెండు నెలల పాటు మెగా ఫ్యాన్స్‌కు పండగే!

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’ ఇండస్ట్రీని షేక్ చేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. - Tollywood news updates

Advertisment
తాజా కథనాలు