/rtv/media/media_files/2026/02/04/u19-2026-02-04-20-48-59.jpg)
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్-19 చరిత్రలో అత్యంత భారీ లక్ష్యాన్ని (311 పరుగులు) ఛేజ్ చేసి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు చాలా ఈజీగా ఫినిష్ చేశారు.
India U19 made it to the Final of the ICC U19 Men's Cricket World Cup 2026.#ICCU19WorldCup#cricketworldcup#creaz#semifinals#INDvsAFGpic.twitter.com/SNtBFgZF00
— CREAZ (@creazcric) February 4, 2026
95 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ
ఆరోన్ జార్జ్ కేవలం 95 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ (115 పరుగులు) చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కేవలం 33 బంతుల్లో 68 పరుగులు చేసి ఆఫ్ఘన్ బౌలర్లను వణికించాడు. ఆయుష్ మాత్రి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 62 పరుగులతో రాణించాడు. వీరి ముగ్గురి జోరుతో భారత్ కేవలం 41.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
India U19 will play against England U19 in the ICC Men's Under-19 Cricket World Cup 2026 final 👏#U19CWCpic.twitter.com/WsHtAWKIUB
— Kamit Solanki (@KamitSolanki) February 4, 2026
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజై (101 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. అఫ్గాన్ చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే భారత బ్యాటర్ల విధ్వంసం ముందు ఆఫ్ఘన్ బౌలర్లు చేతులెత్తేశారు. వరల్డ్ కప్ టైటిల్ కోసం జరిగే మహా సంగ్రామంలో భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరింది.
Follow Us