/rtv/media/media_files/2026/02/04/jagan-2026-02-04-18-29-30.jpg)
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) మండిపడ్డారు. గుంటూరు(guntur) లో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Ram Babu) నివాసాన్ని జగన్ సందర్శించారు. ధ్వంసమైన వాహనాలను, ఇంటిని పరిశీలించిన ఆయన.. అంబటి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అంబటి రాంబాబు ఇంటిపై దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. "కాపు కులంలో అంబటి రాంబాబు ఒక టైగర్. ఆయనను భయపెట్టాలని చూడటం చంద్రబాబు భ్రమ. జీడీపీ ఆఫీసు కూతవేటు దూరంలో ఉన్నా, బెటాలియన్ పక్కనే ఉన్నా.. పోలీసులు దాడిని ఎందుకు ఆపలేదు? నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారు. అధికారులకు ఫోన్ చేస్తే ఒక్కరూ ఎత్తలేదు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నం" అని జగన్ ఆరోపించారు.
అంబటిని అరెస్టు చేసిన తీరుపై జగన్ మండిపడ్డారు. "అక్రమాలను ప్రశ్నిస్తే అంబటిని అరెస్టు చేస్తారు.. కానీ ఆయన ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు ఉండవు. దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసినా చర్యలు లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు, ఇది పక్కా జంగిల్ రాజ్" అని ఆయన ఫైరయ్యారు.
Also Read : నేను నాస్తికుడిని కాదు, సనాతన హిందువును.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను అవమానిస్తున్నారు
తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై జగన్ ఘాటుగా స్పందించారు. "చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. రాజకీయ లబ్ధి కోసం వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను అవమానిస్తున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుష్ప్రచారం చేశారు. అదే నిజమైతే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు ఎందుకు లేవు? అసలు సీబీఐ విచారణ కావాలని కోరిందే వైవీ సుబ్బారెడ్డి. తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, పవన్ చెంపలేసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలి" అని జగన్ డిమాండ్ చేశారు.
Also Read : సోషల్‌మీడియాపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదా?..నాగబాబుపై పవన్ ఫైర్
Follow Us