/rtv/media/media_files/2026/02/04/google-1-2026-02-04-15-38-07.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకుంటున్న కఠిన వీసా నిర్ణయాలకు గూగుల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హెచ్-1బీ (h1b visa) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజులను భారీగా పెంచాలన్న ట్రంప్ సర్కార్ ఆలోచనలకు గూగుల్ తనదైన శైలిలో షాక్ ఇచ్చింది. టాలెంట్ ఉన్న భారతీయులను అమెరికాకు పిలిపించుకోవడం కంటే, భారత్‌లోనే వారికి భారీ ఎత్తున (software)ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుని సంచలనం సృష్టించింది.
ట్రంప్ సర్కార్ ఒక్కో వీసా దరఖాస్తుకు దాదాపు 80 లక్షల రూపాయలకు పైగా ఫీజు వసూలు చేయాలని చూస్తోంది. దీనికి తోడు వీసాల మంజూరులో అనేక కొర్రీలు పెడుతోంది. దీంతో విసిగిపోయిన గూగుల్.. ఇక వీసాల కోసం ఎదురుచూడటం వేస్ట్ అని తేల్చేసింది. అందుకే బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఏకంగా 20,000 మంది పట్టేంత భారీ ఆఫీసును సిద్ధం చేస్తోంది.
Also Read : అందుకే బిల్ గేట్స్ కు విడాకులిచ్చా.. మెలిండా సంచలన విషయాలు!
🚨Alphabet Plots Massive #Bengaluru Expansion to Add Up to 20,000 Jobs Amid US Visa Tightening🚨#Alphabet (Google's parent) is expanding significantly in Bengaluru's Whitefield tech corridor amid tighter #US visa restrictions.
— समृद्धम-भारतम (@DharmaBharatam) February 4, 2026
It has leased one tower (~650,000 sq ft) in… pic.twitter.com/LOsZuGFsGm
ఇప్పటివరకు గూగుల్(google) భారత్(india) లో కేవలం చిన్న చిన్న పనులు లేదా సపోర్ట్ సర్వీసెస్ మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రపంచాన్ని శాసించబోతున్న AI , క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కీలక విభాగాలను భారత్ నుంచే నడపాలని గూగుల్ ఫిక్స్ అయింది. అంటే, అమెరికాలో ఉండాల్సిన మెదళ్లు ఇప్పుడు మన దేశం నుంచే గూగుల్ గ్లోబల్ ప్రాజెక్టులను డీల్ చేయబోతున్నాయి.
Also Read : మంచు దుప్పటి కప్పుకున్న నయాగారా జలపాతం.. ఇలా ఎందుకు మారిపోయిందో తెలుసా ?
గూగుల్ మాత్రమే కాదు
ప్రస్తుతం మన దేశంలో గూగుల్ కు 14 వేల మంది సిబ్బంది ఉండగా, ఈ కొత్త ఆఫీసుతో ఆ సంఖ్య డబుల్ కానుంది. కేవలం గూగుల్ మాత్రమే కాదు, అమెజాన్, మెటా వంటి ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ట్రంప్ పెడుతున్న ఆంక్షలు పరోక్షంగా భారత్‌కు వరంగా మారుతున్నాయని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Follow Us