/rtv/media/media_files/2026/02/04/flight-2026-02-04-21-35-55.jpg)
అమెరికాలో ఒక దేశీయ విమాన ప్రయాణంలో మహిళా ప్రయాణికురాలిపై అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు 38 ఏళ్ల భారతీయ పౌరుడు వరుణ్ అరోరాను ఫెడరల్ జ్యూరీ దోషిగా తేల్చింది. నిందితుడు వరుణ్ ప్రస్తుతం అమెరికాలో సరైన వీసా లేదా చట్టపరమైన అనుమతి లేకుండా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కోర్టు రికార్డుల ప్రకారం, ఈ ఘటన 2024 ఆగస్టు 29న జరిగింది. రోడ్ ఐలాండ్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానం ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ వికృత ఉదంతం చోటుచేసుకుంది. పక్కనే కూర్చున్న మహిళ నిద్రపోతుండగా వరుణ్ ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు మేల్కొని అతని చేతిని పక్కకు నెట్టివేసినా.. అతను కళ్లకు గంతలు (Sleep Mask) కట్టుకుని, నిద్రపోతున్నట్లు నటిస్తూ ఆమెను వేధించడం కొనసాగించాడు.
శిక్ష ఎప్పుడంటే?
ఈ కేసును ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తు చేయగా, విచారణలో వరుణ్ అరోరాపై ఆరోపణలు రుజువయ్యాయి. లైంగిక వేధింపులు, దాడి చేసినందుకు ఆయనకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మే 7వ తేదీన ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించనున్నారు. జైలు శిక్ష అనంతరం నిందితుడిని భారత్‌కు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Follow Us