/rtv/media/media_files/2025/12/24/cm-revanth-2025-12-24-17-11-29.jpg)
CM Revanth
మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రూ.9 వేల కోట్లు రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రూ.9000 కోట్లు రైతు భరోసా
— Telangana365 (@Telangana365) February 4, 2026
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రూ.9000 కోట్ల రైతు భరోసా జమచేయబోతున్నాం.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/tVfGo1esXF
Also Read : పవన్ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి: మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ జరిగింది
కేసీఆర్(kcr) హయాంలో ఫోన్ ట్యాపింగ్(phone tapping case) జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి భార్య భర్తల మాటలు కూడా విన్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదని, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని రేవంత్ చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురేలేదు.. విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు. 7 కార్పొరేషన్‌లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం కార్యకర్తలకు, నాయకులను కోరారు.
ప్రతీ పేద ఇంటికీ సన్న బియ్యం అందిస్తున్నాం.. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం.. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తాం.. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి#Telangana#Congress#Revanthreddy#Miryalaguda…
— NTV Breaking News (@NTVJustIn) February 4, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ రెండేళ్లలోనే రైతుల కోసం రూ. లక్షా 10 వేల కోట్ల ఖర్చు చేసిందని చెప్పారు . 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ఆనాడు వరి పంట వేస్తే ఉరే అని కేసీఆర్ అంటే ఈనాడు వరి పండిస్తే గిట్టుబాటు ధరతోపాటు రూ.500 రూపాయల బోనస్ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు. ప్రతీ పేద ఇంటికీ సన్న బియ్యం అందిస్తున్నాం.. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
Also Read : ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..స్పీకర్ ముందుకు కడియం
Follow Us