/rtv/media/media_files/2025/01/28/7HpxZ7WDZ9sQdscbDCnD.jpg)
Indigo Flight
IndiGo flight:
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికి విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇటీవల మరో ఘటన
ఇటీవల మరో ఇండిగో ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానం ప్రమాదంలో పడింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.
IndiGo Flight Declared 'Mayday’
విమానంలో తక్కువ ఇంధనం ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. అయితే విమానంలోని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే సందేశం ఇవ్వడంతో.. వైద్య, అగ్నిమాపక సహాయక బృందాలు విమానం ల్యాండ్ అయ్యే ప్రదేశానికి చేరుకున్నాయి. రాత్రి 8.20 గంటలకు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.